https://oktelugu.com/

ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లకు షాక్.. ఆ సర్వీసులు నిలిపివేత..?

దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు ఆధార్ కార్డును కలిగి ఉన్నారనే సంగతి తెలిసిందే. అయితే ఆధార్ కార్డ్ ఉన్నవారికి యూఐడీఏఐ భారీ షాక్ ఇచ్చింది. యూఐడీఏఐ కొన్ని ఆధార్ సర్వీసులను నిలిపివేసినట్లు తెలుస్తోంది. యూఐడీఏఐ నిలిపివేసిన సర్వీసుల వల్ల ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లపై ప్రభావం పడుతుండటం గమనార్హం. ఏయే సర్వీసులు అందుబాటులో ఉండవో తెలుసుకుంటే ఆధార్ కార్డుదారులకు ప్రయోజనం చేకూరుతుంది. అడ్రస్ వాలిడేషన్ లెటర్ ద్వారా ఇకపై ఆధార్ కార్డులో అడ్రస్ ను మార్చుకోలేము. ఇకపై ఆధార్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 7, 2021 / 03:20 PM IST
    Follow us on

    దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు ఆధార్ కార్డును కలిగి ఉన్నారనే సంగతి తెలిసిందే. అయితే ఆధార్ కార్డ్ ఉన్నవారికి యూఐడీఏఐ భారీ షాక్ ఇచ్చింది. యూఐడీఏఐ కొన్ని ఆధార్ సర్వీసులను నిలిపివేసినట్లు తెలుస్తోంది. యూఐడీఏఐ నిలిపివేసిన సర్వీసుల వల్ల ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లపై ప్రభావం పడుతుండటం గమనార్హం. ఏయే సర్వీసులు అందుబాటులో ఉండవో తెలుసుకుంటే ఆధార్ కార్డుదారులకు ప్రయోజనం చేకూరుతుంది.

    అడ్రస్ వాలిడేషన్ లెటర్ ద్వారా ఇకపై ఆధార్ కార్డులో అడ్రస్ ను మార్చుకోలేము. ఇకపై ఆధార్ కార్డ్ రీప్రింట్ సేవలు కూడా అందుబాటులో ఉండవని తెలుస్తోంది. ఆధార్ కార్డు వాడే వారికి ఈ రెండు సేవలు అందుబాటులో ఉండవని సమాచారం. అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న వాళ్లకు అడ్రస్ వాలిడేషన్ లెటర్ ఆప్షన్ తొలగించడం వల్ల ప్రతికూల ప్రభావం పడనుంది. ఎలాంటి డాక్యుమెంట్లు లేనివాళ్లు ఇకపై సులువుగా అడ్రస్ ను మార్చుకోలేరు.

    ఇకపై ఆధార్ కార్డు రీప్రింట్ సేవలు కూడా అందుబాటులో ఉండని నేపథ్యంలో కేవలం పీవీసీ కార్డ్ రూపంలో మాత్రమే ఆధార్ కార్డును పొందాల్సి ఉంటుంది. డెబిట్ కార్డు రూపంలో పీవీసీ కార్డ్ లభిస్తుందనే సంగతి తెలిసిందే. యూఐడీఏఐ ట్విట్టర్ లో ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాలను వెల్లడించింది. అడ్రస్, పేరు, పుట్టిన తేదీ వంటి వాటిల్లో తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకోవచ్చు.

    ఆధార్ సెంటర్ కు వెళ్లడం ద్వారా మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవడం, బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. రెండు ముఖ్యమైన సర్వీసులను యూఐడీఏఐ నిలిపివేయడం ఆధార్ కార్డ్ వాడేవాళ్లకు షాక్ అనే చెప్పాలి