Twitter Subscription Price: ఏ వ్యాపారి అయినా తన ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటాడు. తన లాభాలను మాత్రమే అంచనా వేసుకుంటాడు. అంతేతప్ప నష్టాలను చవిచూసి ఉచితంగా సేవలు అందించడానికి ఏమాత్రం ఇష్టపడడు. కాకపోతే తన ఉత్పత్తిని భారీగా ప్రమోట్ చేసుకోవడానికి మొదట్లో “ఉచితం” అనే బిస్కెట్ వేస్తాడు. దానికి ప్రజలు అలవాటు పడిన తర్వాత ఇక తన దోపిడీ మొదలుపెడతాడు. అందుకే వ్యాపారికి కేవలం ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. లాభాలు మాత్రమే ఉంటాయి. సేవ అనేది వ్యాపారి కోణంలో ఉండదు. అసలు అటువంటిది వ్యాపారికి ఇష్టం ఉండదు.. ఇక వ్యాపారంలో చాలామంది రకరకాల విధానాలు పాటిస్తారు. ఎవరి స్టైల్ వారిది. ఇందులో ఎలాన్ మస్క్ స్టైల్ పూర్తి డిఫరెంట్ గా ఉంటుంది. అతడి ఆలోచనలు.. రూపొందించే ప్రణాళికలు డిఫరెంట్ గా ఉంటాయి. అందువల్లే అతడిని కార్పొరేట్ పిసినారి అని పిలుస్తుంటారు.
మస్క్ కు కేవలం టెస్లా, ఎక్స్ మాత్రమే కాకుండా స్టార్ లింక్ అనే పేరుతో సాటిలైట్ వ్యాపారం కూడా ఉంది. ప్రతి వ్యాపారంలోనూ కేవలం లాభాలు మాత్రమే చూసే మస్క్.. ఏదైనా చేస్తాడు. ఎంతకైనా తెగిస్తాడు. చివరికి ఖర్చు ఎక్కువవుతుందని ఉద్యోగులను కూడా తొలగించిన దుర్మార్గుడు మస్క్. ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తొలి రోజుల్లోనే ఉద్యోగులలో సింహభాగం ఇంటికి పంపించాడు. మిగతా వారిని ఇబ్బందులకు గురి చేశాడు. మొత్తంగా పొమ్మనలేక పొగ పెట్టాడు. అంతేకాదు ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చాడు. దానిద్వారా దండిగా ఆదాయాన్ని సంపాదించడానికి సబ్ స్క్రిప్షన్ ను తెరపైకి తీసుకొచ్చాడు. అదే కాదు దానికోసం డబ్బులు కూడా వసూలు చేయడం ప్రారంభించాడు.. ఇప్పుడు సబ్ స్క్రిప్షన్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా 48 శాతం తగ్గింపు ఉంటుందని ప్రకటించాడు. అయితే ఇది కేవలం మనదేశంలోని యూజర్లకు మాత్రమేనట. ఇప్పటివరకు మనదేశంలోని ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కు నెలకు 900 చొప్పున వసూలు చేసేవారు. ఇప్పుడు దానిని 470 కి తగ్గించారు.. ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారికి బ్లూటిక్ వస్తుంది. అంతేకాదు సుదీర్ఘ పోస్టులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
Also Read: నెక్సాన్, పంచ్ లకు షాక్..అమ్మకాల్లో దూసుకుపోయిన మారుతి బ్రాండ్
వెబ్ విధానంలో ఎక్స్ ను వాడేవారు ప్రీమియం సబ్ స్క్రిప్షన్ 650 దాకా చెల్లించేవారు. ఇప్పుడు అది 427 కు తగ్గింది. ఇక నెలవారి బేసిక్
సబ్ స్క్రిప్షన్ చార్జీలు గతంలో 243 రూపాయలుగా ఉండేవి. ఇప్పుడు అది 170 రూపాయలకు పడిపోయింది.. బేసిక్ వినియోదారుల ఇయర్లీ సబ్ స్క్రిప్షన్ న్యూబ్ 2,590 నుంచి 1700 వరకు తగ్గించింది. అయితే తనన మాధ్యమ ఆదాయాన్ని పెంచుకోవడానికి మస్క్ 2023 అక్టోబర్లో తొలిసారిగా సబ్ స్క్రిప్షన్ ను పైకి తీసుకొచ్చాడు. ఇది యాడ్ ఫ్రీ గా ఉంటుంది. సూపర్ రోక్, గ్రోక్ 4 వంటి ప్రతిభ మీద సదుపాయాన్ని యూజర్లకు అందిస్తుంది. ఇక ఈ ప్లాన్ కూడా 3,470 నుంచి 2,570కి పడిపోయింది. మొబైల్ ద్వారా ప్రీమియం ప్లస్ ప్లాన్ గతంలో 5,100 వరకు ఉండేది. ఇప్పుడు అది 3000 రూపాయలకు పడిపోయింది.
త్వరలో భారత్ వేదికగా స్టార్ లింక్ ద్వారా ఇంటర్నెట్ సేవలను మస్క్ అందిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అనుమతులు మొత్తం ప్రభుత్వం ఇచ్చింది. వాస్తవానికి స్టార్ లింక్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించడానికి ముందే మాస్క్ భారతీయుల మనసును ఆకట్టుకోవడానికి ట్విట్టర్ లో సబ్ స్క్రిప్షన్ చార్జీలు తగ్గించినట్టు తెలుస్తోంది. అందువల్లే అనూహ్యంగా సంచలన ప్రకటన చేసినట్టు సమాచారం. వాస్తవానికి ఇన్ని రోజులపాటు యూజర్ల గురించి ఆలోచించని మస్క్.. ఇప్పుడు యుద్ధప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం అదే ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి మస్క్ ఆలోచన పక్కా వ్యాపారి మాదిరిగా ఉందని.. అతడు పక్కా కమర్షియల్ అని నెటిజన్లు పేర్కొంటున్నారు.
(Twitter) slashed subscription prices in India!
In-App Prices (per month)
Basic: Rs 244 -> Rs 170
Premium: Rs 900 -> Rs 470
Premium+: Rs 5,130 -> Rs 3,000Web Prices (per month)
Basic: Rs 244 -> Rs 170
Premium: Rs 650 -> Rs 427
Premium+: Rs 3,470 -> Rs 2,570 pic.twitter.com/QNvPI0ZxSi— Good Vibe Deals (@GoodVibeDeals) July 12, 2025