TVS : ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా ఇప్పుడు బాగా నడుస్తోంది. ఓలా, టీవీఎస్ లాంటి కంపెనీలు ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటివరకు ఓలా తక్కువ ధరలో స్కూటర్లను అందిస్తూ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసింది. కానీ ఇప్పుడు టీవీఎస్ కూడా ఓలాకు పోటీగా తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురాబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : ఆటో ఇండస్ట్రీలో మరో షాక్.. ఏకంగా 20వేల మందిని తీసేస్తున్న కంపెనీ
ఆటోకార్ నివేదిక ప్రకారం.. టీవీఎస్ కంపెనీ తన ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పనిచేస్తోంది. టీవీఎస్ 2020లో ఐక్యూబ్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఇది 3 బ్యాటరీ కెపాసిటీలతో 5 వేరియంట్లలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ ఐక్యూబ్ కంటే తక్కువ ధరలో ఉండే ఎంట్రీ లెవెల్ స్కూటర్‌పై పనిచేస్తోందని సమాచారం. ఇది బ్యాటరీ, లుక్స్ విషయంలో కూడా స్మార్ట్‌గా ఉండబోతోందట.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు తగ్గుతుండడంతో కంపెనీలపై తక్కువ ధరలో మంచి ఉత్పత్తులను తీసుకురావాల్సిన ఒత్తిడి ఉంది. టీవీఎస్ తన ఎంట్రీ లెవెల్ స్కూటర్‌ను తయారు చేయడంలో ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. కానీ కంపెనీ ఐక్యూబ్ తరహాలోనే కొత్త స్కూటర్‌ను రూపొందిస్తుందని భావిస్తున్నారు.
టీవీఎస్ పండుగల సీజన్‌కు ముందే తన ఎంట్రీ-లెవెల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా మార్కెట్ డిమాండ్‌ను అందిపుచ్చుకోవచ్చు. దీని ధర దాదాపు రూ. 90,000 నుంచి రూ.లక్ష (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు. కంపెనీ ఐక్యూబ్‌తో పోలిస్తే సింపుల్ ఫీచర్లు, అదే 2.2kWh బ్యాటరీ ప్యాక్ లేదా కొంచెం చిన్న బ్యాటరీ ప్యాక్‌ను అందించడం ద్వారా ఈ ధరను సాధించవచ్చు. అయితే స్కూటర్ పేరు గురించి కూడా ఇంకా స్పష్టమైన సమాచారం లేదు.