Homeబిజినెస్TVS Orbiter V1 vs V2 Differences: TVS Orbiter V1, V2 ల మధ్య...

TVS Orbiter V1 vs V2 Differences: TVS Orbiter V1, V2 ల మధ్య ఉన్న తేడాలు ఇవే..

TVS Orbiter V1 vs V2 Differences: ఆటోమోబైల్ మార్కెట్లో మిగతా కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది TVS. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడంలో ఈమధ్య ఈ కంపెనీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీని నుంచి అనేక రకాల EV లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే దీనికి చెందిన ఆర్బిటర్ V1, ఆర్బిటర్ V2 బైక్స్ గురించి ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. ఇవి ప్రారంభంలో ఒకే వేరియంట్ లో ప్రారంభించినప్పటికీ వీటి మధ్య చాలా తేడాలు ఉన్నట్లు కొందరు నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీటి మైలేజ్ తో పాటు ధరల్లో కూడా చాలా వ్యత్యాసం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంతకీ వీటి మధ్య ఉన్న తేడాలు ఏమో ఇప్పుడు చూద్దాం..

ఆర్బిటర్ V1 విషయానికి వస్తే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 1.8 kWh బ్యాటరీ ప్యాక్ ను చేర్చారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 68 కిలోమీటర్ల మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా దీని చార్జింగ్ కావడానికి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. 2.8 కిలో వాట్ గరిష్ట ఉత్పత్తితో బి ఎల్ డి సి మోటార్ నుంచి పవర్ అందిస్తుంది. ఇందులో చిన్న బ్యాటరీ ఉన్నప్పటికీ డిజైన్ విషయంలో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఇందులో 14 అంగుళాల ఫ్రంట్ వీల్ తోపాటు 12 అంగుళాల రియర్ వీల్ సెటప్ కలర్ ఎల్సిడి డిస్ప్లే, క్రూయిస్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. దీని ధర రూ.84,500 ప్రారంభం నుంచి విక్రయిస్తున్నారు.

ఆర్బిటర్ V2 ఫీచర్స్ లోకి వెళ్తే.. ఇందులో 3.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కనిపిస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 158 కిలోమీటర్ల వరకు వెళ్ళవచ్చు. ఇది జీరో నుంచి 80% వరకు చార్జింగ్ కావడానికి 4:10 నిమిషాల సమయం పడుతుంది. టెక్నాలజీ విషయంలో V1 వంటి ఫీచర్లే ఉన్నప్పటికీ 68 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ప్రయాణం చేస్తుంది. ఇందులోను ఎల్సిడి డిస్ప్లే తోపాటు క్రూజ్ కంట్రోల్ వంటి వాటిని చూడొచ్చు. ఈ స్కూటర్ మొత్తం ఆరు కలర్లలో లభిస్తుంది. దీనిని రూ.99,000 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

రోజువారి వినియోగదారులతో పాటు స్టైలిష్ గా రైడ్ చేయాలని అనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇంట్లో వస్తువులను కొనుగోలు చేయడానికి ముందటి భాగంలో స్పేస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే హెడ్ లాంపు ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular