TVS Ntorq 150: టీవీఎస్ మోటార్ కంపెనీ గత ఏడేళ్లుగా ఎన్‌టార్క్ సిరీస్‌ను విక్రయిస్తోంది. కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు, ప్రత్యేక ఎడిషన్లతో ఈ శ్రేణిని విస్తరించింది. ప్రస్తుతం మార్కెట్‌లో టీవీఎస్ ఎన్‌టార్క్ 125 యాక్టివా 125, యాక్సెస్ 125, బర్గ్‌మన్ స్ట్రీట్ 125, యమహా రేజెడ్‌ఆర్ 125 వంటి స్కూటర్లకు గట్టి పోటీనిస్తోంది. ఇప్పుడు కంపెనీ ఎన్‌టార్క్ పేరుకున్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని, దానిని 150cc సెగ్మెంట్‌లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. రాబోయే టీవీఎస్ ఎన్‌టార్క్ 150 ఈ సంవత్సరం చివరి నాటికి భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇంతకీ ఈ కొత్త స్కూటర్‌లో ఏముండబోతోంది? ఇంజిన్ ఎలా ఉండబోతోంది? ఫీచర్లు ఏంటి? వివరంగా తెలసుకుందాం.
Also Read: ఇక మొత్తం మహీంద్రా కార్లే ఉంటాయేమో.. మార్కెట్లోకి మరో మూడు మోడల్స్
కొత్త ఇంజిన్ కనిపించవచ్చు
ప్రస్తుత శ్రేణిలో టీవీఎస్ వద్ద 300cc కంటే తక్కువ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ లేదు. అయితే ఏరోక్స్, జూమ్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌లతో వస్తున్నాయి. హోసూరుకు చెందిన ఈ తయారీదారు ఇప్పటికే ఒక కొత్త 300cc ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టీవీఎస్ ఎన్‌టార్క్ 150లో ఈ పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగించవచ్చు. మరోవైపు, టీవీఎస్ 150cc సిరీస్ మరింత అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లయితే అది పూర్తిగా కొత్త లిక్విడ్-కూల్డ్ యూనిట్‌ను కూడా అందించే అవకాశం లేకపోలేదు.
అదిరిపోయే స్కూటర్ ఫీచర్లు
రాబోయే ఈ స్కూటర్‌లో వినియోగదారులకు కనెక్టెడ్ ఫీచర్లు, అధునాతన ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, స్పోర్టీ డీకల్స్, స్ప్లిట్ సీట్లు, పెద్ద సైజు అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ లైటింగ్ వంటి అనేక లేటెస్ట్ ఫీచర్లను అందించే అవకాశం ఉంది. టీవీఎస్ ఎన్‌టార్క్ 150 విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్కూటర్ ప్రియులకు ఇది నిజంగా శుభవార్తే. ఈ స్కూటర్ మార్కెట్‌లోకి వస్తే 150cc సెగ్మెంట్‌లో గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.ఇప్పటికే మార్కెట్లో అత్యధికంగా టూ వీలర్లను విక్రయిస్తూ మార్కెట్లో టాప్ పొజిషన్లో నిలుస్తోంది. ఎప్పటి కప్పుడు అప్ డేట్ మోడల్స్ అందిస్తూ తన స్థానాన్ని టీవీఎస్ మెరుగు పరుచుకుంటుంది.