Triumph Speed Triple 1200 RS: ఇండియాలో కూడా లగ్జరీ బైకులకు డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఖరీదైన బైకులను మన దేశంలోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతదేశంలో 2025 ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 RS బైక్ లాంచ్ అయింది. పాత మోడల్‌తో పోలిస్తే దీని ధర రూ.2.44 లక్షలు ఎక్కువ. ఇప్పుడు దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.20.39 లక్షల నుంచి మొదలవుతుంది. అయినప్పటికీ, ఇది డుకాటీ స్ట్రీట్‌ఫైటర్ V4, KTM 1390 సూపర్ డ్యూక్ R వంటి యూరోపియన్ బైక్‌ల కంటే చౌక. కొత్త బైక్‌లో మంచి రైడింగ్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి అనేక మెకానికల్, ఎలక్ట్రానిక్ మార్పులు చేశారు.
బైక్ మొత్తం లుక్ ఇప్పటికీ షార్ప్, స్పోర్టీగా ఉంటుంది. ఇందులో కొత్తగా 3 కలర్ ఆప్షన్లు తీసుకొచ్చారు. కంప్లీట్ బ్లాక్ స్టీల్త్ లుక్, గ్రే, రెడ్ కలర్ల స్పోర్టీ కాంబినేషన్, గ్రేతో పాటు యెల్లో హైలైట్స్ ఉన్న ఆప్షన్ ఉన్నాయి. అంతేకాకుండా, ఇప్పుడు బైక్‌కు కొత్త అల్లాయ్ వీల్స్ వచ్చాయి. అవి మునుపటి వాటి కంటే లైటుగా ఉన్నాయి. దీని వల్ల బైక్ బరువు తగ్గి, హ్యాండ్లింగ్ మరింత మెరుగుపడింది.
Also Read: టాటా కంటే మారుతిదే పైచేయి.. ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 CNG కార్లు ఇవే!
ఇప్పుడు బైక్‌లో వీలీ కంట్రోల్ సిస్టమ్‌న, ట్రాక్షన్ కంట్రోల్ నుంచి వేరుగా అడ్జస్ట్ చేయవచ్చు. దీని వల్ల ఎక్స్ పీరియన్స్ రైడర్‌లకు మరింత మంచి కంట్రోల్ లభిస్తుంది. మొదటిసారిగా ఈ బైక్‌లో స్టీరింగ్ డ్యాంపర్ ఇచ్చారు. ఇది హై-స్పీడ్‌లో బైక్‌ను మరింత స్టెబిలిటీగా ఉంచుతుంది.ఓహ్లిన్స్ సస్పెన్షన్‌ను కొత్త EC3 ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ యూనిట్లతో అప్‌డేట్ చేశారు. దీని వల్ల సస్పెన్షన్‌ను నడుస్తున్న బైక్‌పైనే అడ్జస్ట్ చేయవచ్చు. ఇది భారతీయ రోడ్లకు మరింత అనుకూలంగా మారింది.
Also Read: రూ.6లక్షలకే 34కిమీలకు పైగా మైలేజీ.. అమ్మకాల్లో స్విఫ్ట్, బాలెనో దీని దరిదాపుల్లో కూడా లేవు
ఇప్పుడు బైక్‌కు పిరెల్లి సూపర్‌కార్సా V3 టైర్లు వచ్చాయి. ఇవి పాత మెట్‌జెల్లర్ రేస్‌టెక్ RR టైర్ల స్థానంలో వచ్చాయి. టైర్ సైజ్ (17 అంగుళాలు) మారలేదు. కానీ కొత్త టైర్ల వల్ల రోడ్డుపై, ట్రాక్‌పై రెండింటిలోనూ మెరుగైన గ్రిప్ లభిస్తుంది. బైక్‌లో పాత 1160cc ఇన్‌లైన్ ట్రిపుల్ ఇంజిన్ ఉంది. ఇది 183 bhp పవర్‌ను, 128 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గతంలో కంటే కొద్దిగా ఎక్కువ. ఈ పవర్ పెరుగుదల కొత్త ఫ్రీ-ఫ్లో ఎగ్జాస్ట్ సిస్టమ్ వల్ల సాధ్యమైంది. బైక్ బరువు 1 కిలో పెరిగి 199 కిలోలకు చేరింది. అయితే, తేలికైన వీల్స్,పెరిగిన పవర్ దీనిని బ్యాలెన్స్ చేస్తాయి.