Best Selling CNG Cars: ప్రస్తుతం పెట్రోల్ కార్లతో పాటు సీఎన్జీ కార్లకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చాలా మంది ఇంధన ఖర్చులను తగ్గించుకోవడానికి సీఎన్జీ కార్లను కొనుగోలు చేస్తున్నారు. అందుకే కార్ల కంపెనీలు తమ పాపులర్ మోడళ్లలో సీఎన్జీ వెర్షన్‌లను కూడా విడుదల చేస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం 2025లో ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 సీఎన్జీ కార్లు ఏవో తెలుసకుందాం.
గాడివాడి రిపోర్టు ప్రకారం అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 సీఎన్జీ కార్లు ఇవే
1. మారుతి సుజుకి ఎర్టిగా సీఎన్‌జీ : ఈ కారు 1,29,920 యూనిట్లతో మొదటి స్థానంలో ఉంది. ఇది అత్యధికంగా అమ్ముడైన సీఎన్జీ కారు. ఒక కిలోగ్రామ్ సీఎన్జీతో 26.11 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ.8,96,500 నుండి రూ.13,25,500 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
2. మారుతి సుజుకి వాగన్ఆర్ సీఎన్‌జీ : రెండో స్థానంలో ఉన్న ఈ కారు 1,02,128 యూనిట్లతో మంచి అమ్మకాలను సాధించింది. ఇది కూడా మారుతి నుంచే.
3. మారుతి సుజుకి డిజైర్ సీఎన్‌జీ : 89,015 యూనిట్లతో మూడో స్థానంలో ఉంది. ఇది కూడా మారుతి కంపెనీ కారు కావడం విశేషం.
4. టాటా పంచ్ సీఎన్‌జీ : నాలుగో స్థానంలో టాటా మోటార్స్ నుండి పంచ్ సీఎన్‌జీ ఉంది. దీని 71,113 యూనిట్లు అమ్ముడయ్యాయి.
5. మారుతి సుజుకి బ్రెజ్జా సీఎన్‌జీ : ఐదో స్థానంలో మళ్ళీ మారుతి సుజుకి బ్రెజ్జా సీఎన్‌జీ నిలిచింది. దీని 70,928 యూనిట్లు అమ్ముడయ్యాయి.
మారుతికి తిరుగులేని ఆధిపత్యం
ఈ జాబితాను చూస్తే ఓ విషయం క్లియర్ గా తెలుస్తోంది. టాప్ 5లో మారుతి సుజుకి కార్లే 4 స్థానాలను ఆక్రమించాయి. ఇది సీఎన్జీ కార్ల మార్కెట్‌లో మారుతికి ఉన్న తిరుగులేని ఆధిపత్యాన్ని చూపిస్తుంది. టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి కంపెనీలు కూడా సీఎన్జీ కార్లను అందిస్తున్నప్పటికీ, మారుతి వాటిని అమ్మకాల్లో చాలా వెనక్కి నెట్టింది. లో మెయింటెనెన్స్ ఖర్చులు, ఎక్కువ మైలేజ్, మారుతి బ్రాండ్ నమ్మకం దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.