Transferring iPhone : ఐఫోన్ నుండి ల్యాప్‌టాప్‌కు ఫోటోలు ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా మందికి ఒక సవాలుగా ఉంటుంది. ఫోన్ నుండి ఫోన్‌కు డేటా ట్రాన్స్‌ఫర్ చేయడం సులభమే అయినప్పటికీ, ఫోన్ నుండి ల్యాప్‌టాప్‌కు ఫోటోలు, వీడియోలు పంపే విధానం చాలా మందికి తెలియదు. అయితే, కొన్ని ఈజీ పద్ధతుల ద్వారా నిమిషాల్లోనే మీ ఐఫోన్ ఫోటోలు, వీడియోలను ల్యాప్‌టాప్‌కు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ఐఫోన్ నుండి ల్యాప్‌టాప్‌కు ఫోటోలు, వీడియోలు ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఇక్కడ 5 ఈజీ మార్గాలు ఉన్నాయి:
Also Raed : ఐఫోన్ 16 ప్రో మాక్స్ బ్యాటరీ.. పాడైతే కొత్త ఫోన్ కొనేంత ఖర్చు చేయాల్సిందే !
యూఎస్‌బీ కేబుల్
ఐఫోన్‌ను యూఎస్‌బీ కేబుల్ ద్వారా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేయండి. “ట్రస్ట్ దిస్ కంప్యూటర్” అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో “ట్రస్ట్” పై క్లిక్ చేయండి. మీ ల్యాప్‌టాప్‌లో ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేయండి. ఐఫోన్ ఓపెన్ చేసి, DCIM ఫోల్డర్‌కు వెళ్లి ఫోటోలను కాపీ చేసి పేస్ట్ చేయండి.
ఐక్లౌడ్
ఐక్లౌడ్ ద్వారా ఫోటోలు పంపడానికి, ఐఫోన్‌లో సెట్టింగ్‌లకు వెళ్లండి. తర్వాత ఆపిల్ ఐడికి వెళ్లి ఐక్లౌడ్‌పై క్లిక్ చేయండి. అందులో ఫోటోలపై క్లిక్ చేయండి. ఐక్లౌడ్ ఫోటోలను ఆన్ చేయండి. ల్యాప్‌టాప్‌లో www.icloud.com ఓపెన్ చేసి లాగిన్ చేయండి. ఇక్కడ నుండి ఫోటోలను డౌన్‌లోడ్ చేయండి. ఫోటోలు ల్యాప్‌టాప్‌లో కనిపిస్తాయి.
ఈమెయిల్
ఐఫోన్‌లో ఫోటోలను సెలెక్ట్ చేసి, మెయిల్ ద్వారా మీకే పంపండి. తర్వాత ల్యాప్‌టాప్‌లో ఈమెయిల్ ఓపెన్ చేసి ఫోటోలను డౌన్‌లోడ్ చేయండి. కొద్ది ఫోటోలు పంపడానికి ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది.
ఎయిర్‌డ్రాప్ (మాక్ ల్యాప్‌టాప్ కోసం)
మీ ల్యాప్‌టాప్ మాక్ అయితే, ఎయిర్‌డ్రాప్ ఫోటోలు, వీడియోలు ట్రాన్స్‌ఫర్ చేయడం స్పీడుగా పూర్తవుతుంది. ఐఫోన్, మాక్‌లో వై-ఫై, బ్లూటూత్ ఆన్ చేయండి.ఐఫోన్‌లో ఫోటోలను సెలెక్ట్ చేసి, షేర్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఎయిర్‌డ్రాప్‌కు వెళ్లి మాక్‌ను సెలెక్ట్ చేయండి. ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
గూగుల్ ఫోటోలు లేదా క్లౌడ్ యాప్
ఐఫోన్‌లో గూగుల్ ఫోటోల యాప్ ఇన్‌స్టాల్ చేయండి. తర్వాత అందులో ఫోటోలు అప్‌లోడ్ చేయండి. ల్యాప్‌టాప్‌లో photos.google.com ఓపెన్ చేసి లాగిన్ చేసి అన్ని ఫోటోలను డౌన్‌లోడ్ చేయండి.
Also Read : ఐఫోన్ స్క్రీన్ ధరతో కొత్త బైక్ కొనుక్కోవచ్చు.. పగిలితే అంతే!