Train Reels: చేతిలో మొబైల్ ఉంటే చాలు.. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ హడావుడి చేస్తారు కొందరు. ఈ మధ్య కొందరు కదులుతున్న ట్రైన్ వద్ద.. నడుస్తున్న ట్రైన్ లో ఎక్కుతూ రీల్స్ చేస్తున్నారు. కానీ వీటివల్ల ప్రమాదాలు ఎక్కువే అని గుర్తించాలి. అంతేకాకుండా ఇలా కొందరు ఉపయోగం లేని వీడియోలు తీస్తూ రైల్వే వ్యవస్థకు నష్టాన్ని చేకూరుస్తున్నారు. అయితే ఇలా అకారణంగా నష్టాన్ని చేకూర్చిన వారికి రైల్వే బోర్డు భారీగా జరిమానా విధిస్తుంది. ముఖ్యంగా అత్యవసరం లేకున్నా.. తమ ఫ్రెండ్ రీల్స్ చేస్తూ లేట్ కావడంతో వారి కోసం.. లేదా బంధువు కోసం ట్రైన్ చైన్ లాగడం వల్ల రైల్వే బోర్టు తీవ్రంగా స్పందిస్తుంది. దీని ఫలితంగా జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా వేస్తుంది. ఇంతకీ ఆ వివరాలేంటంటే?
ఇద్దరు స్నేహితులు ట్రైన్ లో ప్రయాణించాలనుకుంటారు. ఒకరు రైలులోకి వెళ్లి సీట్లు కూర్చొని ఉంటారు. మరో వ్యక్తి మాత్రం మొబైల్ తో రీల్స్ చేస్తూ బయట హడావుడి చేస్తాడు. ఇంతలో ట్రైన్ కదులుతుంది. అయినా కదులుతున్న ట్రైన్ వద్ద తాను ఉన్నాననే రీల్స్ చేస్తాడు. దీంతో తన ఫ్రెండ్ ట్రైన్ మిస్సవుతాడనే భయంతో రైలు లోపల ఉన్న వ్యక్తి ట్రైన్ చైన్ లాగుతాడు. దీంతో రైలు ఆగిపోతుంది. తన స్నేహితుడు సాఫీగా వచ్చి రైలులో ఎక్కుతాడు.
ప్రతీ రైలులో వందల కొద్దీ ప్రయాణికులు రాకపోకలు నిర్వహిస్తుంటారు. అంతేకాకుండా పట్టాలపై నిత్యం అనేక ట్రైన్స్ రాకపోకలు చేస్తుండడంతో పట్టాలు ఎప్పటికప్పుడు క్లియర్ కావాల్సిన అవసరం ఉంది. దీంతో అనుకున్న సమయానికి ట్రైన్ గమ్యానికి చేరుస్తారు. ఏదైనా ప్రమాదం లేదా ట్రైన్ లో సాంకేతిక లోపం ఏర్పడితే తప్ప ట్రైన్ ఆగపోవడం అనేది ఉండదు. కానీ కొందరు తమ వ్యక్తిగత అవసరాల కోసం ట్రైన్ ప్రయాణాన్ని ఆలస్యం చేస్తున్నారు. దీనిని రైల్వే బోర్డు అస్సలు సహించదు.
రైలులో ఉండే చైన్ అత్యవసర సమయానికి ఉపయోగించుకోవచ్చు. తమకు సంబంధించిన వ్యక్తులు ట్రైన్ అందుకోకపోతే ట్రైన్ ను ఆపోచ్చు. అయితే వారు వికలాంగులు అయి ఉండాలి. లేదా ఆపద సమయంలోనైనా ఉండాలి. కానీ అకారణంగా ట్రైన్ చైన్ లాగిగే రైల్వే బోర్డు భారీ జరిమానా విధిస్తుంది. ఇలా చేసినందుకు రూ.1000 జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా వేయొచ్చు. అందువల్ల ట్రైన్ వద్ద రీల్స్ చేస్తూ రైల్వే వ్యవస్థతో ఆటలాడకుండా ఉండడం మంచిది.