Toyota: 2024 ఏడాదిలో భారత్ లో పలు కంపెనీలు కొత్త కార్లను లాంచ్ చేయనున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకీ, హ్యుందాయ్, కియా కంపెనీలు కొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించాయి. తాజాగా జపనీస్ కంపెనీ టయోటా సైతం కొత్త కారును తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది క్వార్టర్ లో ‘అర్బన్ క్రూయిజర్ టైజర్’ అనే SUV ని వినియోగదారులకు పరిచయం చేయనుంది. ఇది మారుతి ఫ్రాంక్స్ ప్లాట్ ఫాం పై తయారవుతున్నా.. దీనికంటూ ప్రత్యేకత ఉంటుంది. అయితే ఈ మోడల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..
భారత్ లో టయోటా తన కార్లను ఇప్పటికే పరిచయం చేసింది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఇన్నోవా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా SUV వేరియంట్ లో కొత్త కారును తీసుకొస్తుంది. ఈ మోడల్ 1.2 లీటర్ సహజ పెట్రోల్ తో పాటు 1.0 లీటర్ టర్బో ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 89 బీహెచ్ పీ పవర్ ను అందిస్తూ 5 స్పీడ్ మాన్యువల్ ఏంఎటీ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. అలాగే 99 బీహెచ్ పీతో 5 స్పీడ్ మాన్యువల్ 6 స్పీడ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ఫీచర్స్ విషయానికొస్తే.. 9 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే తో కూడిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎంఐడీ కలర్ తో కూడి డిజిటల్ ఇనిస్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఈ కారులో సేప్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉన్నాయి. వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే టచ్ స్క్రీన్ ఆకర్షిస్తుంది. మారుతి నుంచి వచ్చిన బ్రెజ్జాకు పోటీ ఇచ్చిన అర్బన్ క్రూయిజర్ నిలిపివేసిన తరువాత ఇప్పుడు SUV సెగ్మెంట్ లోకి క్రూయిజర్ రావడం ఆసక్తిగా మారింది.
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మోడల్ డిజైన్ ఆకర్షిస్తోంది. SUV వేరియంట్లు టాటా నెక్సాన్, కియా సోనెట్, రెనాల్ట్ కిగర్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు క్రూయిజర్ ను రెడీ చేస్తున్నారు. వైవిధ్యమైన లుక్ తో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్న ఈ మోడల్ పై వినియోగదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.