Homeబిజినెస్Toyota Rumion sales growth: Toyota కారుకు విపరీతమైన డిమాండ్.. ఒక ఏడాదిలోనే 117% రెట్టింపు...

Toyota Rumion sales growth: Toyota కారుకు విపరీతమైన డిమాండ్.. ఒక ఏడాదిలోనే 117% రెట్టింపు వృద్ధి..

Toyota Rumion sales growth: ఆటో మోబైల్ మార్కెట్లో MPV సెగ్మెంట్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. చాలామంది తమ ఇంటి అవసరాలతో పాటు వాణిజ్య అవసరాలకు కూడా ఉండేలా ఇలాంటి కారులను కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చాలా కంపెనీలు MPV లను తీసుకొస్తున్నాయి. కానీ కొన్ని కంపెనీలకు చెందిన కార్లు మాత్రమే ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి. అందులో టయోటా కంపెనీకి చెందిన ఓ కారు ఒక ఏడాదిలోనే దాదాపు రెట్టింపు శాతం కొనుగోలు పెరిగాయి. ఈ కారులో ఉండే ప్రత్యేక ఫీచర్స్.. సౌకర్యాలు ఈ కొనుగోళ్లకు కారణమని ప్రతినిధులు అంటున్నారు. ఇంతకీ ఇది ఏ కారు? ఇందులో ఉండే స్పెషల్ ఏంటి?

Toyota కంపెనీకి చెందిన Rumion కారు అమ్మకాలు జోష్ పెంచుతున్నాయి. ఈ కారు 2026 మార్చి నెలలో 3892 యూనిట్ల సేల్స్ నమోదు చేస్తుంది. అయితే ఇదే కారు 2025 మార్చి నెలలో 1793 యూనిట్ల సేల్స్ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 117 రెట్టింపు శాతం పెరుగుదలను నమోదు చేసింది. దీంతో మార్కెట్లో రూమియన్ కారుకు ఏ రకమైన డిమాండ్ ఉందో అర్థం అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి ఫ్యామిలీతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు.. కార్యాలయ అవసరాలకు ఈ కారు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ప్రత్యేకమైన ఫీచర్లు కార్ల కొనుగోలుకు కారణమయ్యాయి.

ఈ కారులో 7 గురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. క్యాబిన్లో విశాలమైన స్పేస్ ఉండడంతో పాటు బస్సులు, రైళ్లలో ఉండే విధంగా అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. వన్ పాయింట్ ఫైవ్ లీటర్ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉన్న ఇందులో 102 బిహెచ్పి పవర్, 137 NM టార్క్ ను పెళ్లి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ తోపాటు 6 స్పీడు టార్క్ కన్వర్టెడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ లీటర్ ఇంధనానికి 20.11 కిలోమీటర్ల మైలేజ్ నీ అందిస్తుంది. ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో 20.51 కిలోమీటర్ల వరకు వెళ్ళవచ్చు. అలాగే ఈ కారులో CNG ఆప్షన్ కూడా ఉండడంతో మైలేజ్ ఎక్కువగా వస్తుంది. ఈ ఇంజన్ పై 26.11 కిలోమీటర్ల మైలేజ్ ని అందిస్తుంది.

ప్రస్తుతం ఈ కారు ధర మార్కెట్లో రూ.9.55 లక్షలా ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ వేరియంట్ ధర రూ.13.86 లక్షల వరకు ఉండనుంది. మారుతి సుజుకి ఎర్టిగా ప్లాట్ ఫామ్ పై ఆధారపడి ప్రత్యేక డిజైన్ తో మార్కెట్లోకి వచ్చిన ఈ కారుకు ఇటీవల డిమాండ్ పెరగడం పై ఆసక్తిగా చర్చ సాగుతోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular