Toyota Rumion MPV: కార్లపై వినియోగదారులు ఎక్కువగా మక్కువ చూపుతుండడంతో కంపెనీలు వివిధ మోడళ్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. తాజాగా ఓ కంపెనీ కొత్త కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. లేటెస్ట్ ఫీచర్స్ తో పాటు సరసమైన ధరలకు తీసుకొచ్చిన ఈ కారు భద్రత పరంగా కూడా బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ప్రస్తుతం ఎక్కువ శాతం ఎస్ యూవీలపై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఇదే సమయంలో కంపెనీ వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ మోడల్ ను తీసుకొచ్చింది. ఇంతకీ ఆ కారు గురించి తెలుసుకోవాలని ఉందా.. అయితే వెంటనే వివరాల్లోకి వెళ్దాం..
టయోటా కంపెనీ నుంచి ఆకర్షించే కార్లు ఇప్పడికే రోడ్లపై తిరుగుతున్నాయి. ఈ కంపెనీ నుంచి ఇన్నోవా హై రేంజ్ లో అమ్మకాలు సాగాయి. ఇప్పుడు ఇదే తరహాలో మరో ఎంపీవీని మార్కెట్లోకి తీసుకొచ్చారు. అదే టయోటా రూమియన్ ఎంపీవీ. లేటెస్ట్ వెర్షన్లో ఈ మోడల్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇన్నోవా క్రిస్ట్ తరహాలో ప్రాజెక్టర్ హెడ్ ల్యాంప్ లను కలిగి ఉండి, క్రోమ్ ఇన్ సర్ట్ లతో డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఈ మోడల్ కలిగి ఉంది. కొత్త గ్రిల్, ఎల్ ఈడీ టెయిల్ లైట్ తో ఆరు రంగుల్లో అలరిస్తుంది.
టయోటా రూమియన్ ఎంపీవీ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లను కలిగి ఉంది. ఇది 1.5 లీటర్ కె సిరీస్ పెట్రోల్ ఇంజిన్ 6000 ఆర్పీఎం వద్ద 101 బీహెచ్ పీ శక్తి, 4400 ఆర్ పీఎం వద్ద 136.8ఎన్ ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఫ్యూయెల్ తో పాటు సీఎన్ జీ ని కలిగిన ఇది 5500 ఆర్ పీఎం వద్ద 86.63 బీహెచ్ పీ శక్తిని, 4200 ఇర్ పీఎం వద్ద 121.5 ఎన్ ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వేరియంట్ 20.51 కిలోమీటర్ ఫర్ మైలేజీ, సీఎన్ జీ వెర్షన్ లో 26.11 కేఎంపీహెచ్ మైలీజీని ఇస్తుంది.
ఈ కారు భద్రతా పరంగా బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్ లు, క్రూయిజ్ కంట్రోల్, టయోటా ఐ కనెక్ట్ టెక్నాలజీ, ఆటోమెటిక్ క్లెమెట్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, అడ్జస్ట్ బుల్ డ్రైవర్ సీట్, చైల్డ్ సీట్ మౌంట్ఖ తో అన్ని రకాల భద్రతా ఫీచర్లు ఉన్నాయి. కారు వెలుపల కూడా ఫాగ్ ల్యాంప్ లు ఎర్టిగా కంటే బిన్నంగా ఉన్నాయి. ఇంటీరియల్ 7 సీటర్ లేఅవుట్ ను కలిగి ఉన్న కేబిన్ లేత గోధుమ రంగులో అందుబాటులో ఉంది. ఇక ఈ కారు ప్రారంభ ధర రూ.10.29 లక్షల నుంచి 13.68 లక్సల వరకు విక్రయిస్తున్నారు.