Toyota: టయోటా కిర్లోస్కర్ మోటర్ భారతీయ మార్కెట్లో ఇన్నోవా హైక్రాస్ సరికొత్త స్పెషల్ ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. దీనికి ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ అని పేరు పెట్టారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.32.58 లక్షలు. ఇది ZX(O) వేరియంట్‌పై ఆధారపడింది. లిమిటెడ్ టైంకు మాత్రమే సూపర్ వైట్, పెర్ల్ వైట్ అనే రెండు రంగుల్లో డ్యూయల్ టోన్‌తో ఇది అందుబాటులో ఉంటుంది. హైక్రాస్ ఇన్నోవా హైబ్రిడ్ మోడల్. ఎక్కువ మైలేజ్ కోసం దీనిని రిలీజ్ చేశారు.
ఈ స్పెషల్ ఎడిషన్‌లో డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌తో పాటు మరికొన్ని కాస్మెటిక్ మార్పులు కూడా ఉన్నాయి. ఈ ఎడిషన్‌లో బ్లాక్-అవుట్ ఎలిమెంట్స్ కూడా ఉండవచ్చు. రూఫ్, ఫ్రంట్ గ్రిల్, రియర్ గార్నిష్, అల్లాయ్ వీల్స్, హుడ్ ఎమ్బ్లెమ్ బ్లాక్ కలర్‌లో ఉంటాయి. ఫ్రంట్ స్కిడ్ ప్లేట్, గ్రిల్ గార్నిష్ కూడా బ్లాక్‌లోనే ఉంటాయి. సైడ్‌లో వీల్ ఆర్చ్ మోల్డింగ్, అవుట్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్ కోసం గార్నిష్ కూడా బ్లాక్‌లోనే ఉంటుంది. వెనుకవైపు స్కిడ్ ప్లేట్, టెయిల్‌గేట్ కోసం గార్నిష్ కూడా బ్లాక్‌లోనే ఉంటుంది. టయోటా ఈ స్పెషల్ ఎడిషన్‌లో స్పెషల్ రియర్ బ్యాడ్జ్‌ను కూడా యాడ్ చేసింది.
ఇన్నోవా హైక్రాస్ ఇంటీరియర్‌లో కూడా మార్పులు చేశారు. ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, డోర్ ఫాబ్రిక్, సీట్ మెటీరియల్, సెంటర్ కన్సోల్ లిడ్‌ను డ్యూయల్-టోన్ థీమ్‌లో ఉంచారు. టయోటా ఎయిర్ ప్యూరిఫైయర్, లెగ్ రూమ్ ల్యాంప్, వైర్‌లెస్ ఛార్జర్‌ను కూడా యాడ్ చేసింది. టయోటా ఇన్నోవా హైక్రాస్‌లో అదే 2.0-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది eCVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ ఎంపీవీ హైబ్రిడ్ వెర్షన్ మైలేజ్ లీటరుకు 23.24కిలో మీటర్లు అని టయోటా చెబుతోంది.
ఇన్నోవా హైక్రాస్ సేఫ్టీ ఫీచర్లు కూడా బాగున్నాయి. ఇటీవల ఇన్నోవా హైక్రాస్‌ను అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ (AVAS)తో అప్‌డేట్ చేశారు. ఇది ఒక సేఫ్టీ ఫీచర్. దీని ప్రకారం కారు దగ్గరకు ఎవరైనా వస్తే సౌండ్ ద్వారా డ్రైవర్‌ను అలెర్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఇన్నోవా హైక్రాస్ ధర రూ.19.94 లక్షల నుండి ప్రారంభమై రూ.32.58 లక్షల వరకు ఉంది. ఈ రెండు ధరలు ఎక్స్-షోరూం ధరలే.