Toyota Innova Hycross : టయోటా ఇన్నోవా హైక్రాస్ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న MPVలలో ఒకటిగా నిలిచింది. దీని కోసం వేచి ఉండే కాలం గణనీయంగా పెరుగుతోంది. ఈ కారును కొనుగోలు చేసేందుకు ప్రజలు కార్ లోన్ కోసం కూడా ఎదురుచూస్తున్నారు. ఇన్నోవా హైక్రాస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 20 లక్షల నుండి ప్రారంభమై రూ. 31.34 లక్షల వరకు ఉంటుంది. ఈ ధర పరిధిలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఈ కారు ఒకటి. ఇన్నోవా హైక్రాస్ టాప్-ఎండ్ మోడల్ హైబ్రిడ్ వెర్షన్ ధర రూ. 30 లక్షల కంటే ఎక్కువ. ఈ టయోటా కారు ఇన్నోవా క్రిస్టా కంటే ఎంత వరకు డిఫరెంట్ గా ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
టయోటా ఇనోవా హైక్రాస్ మైలేజ్
టయోటా ఇన్నోవా హైక్రాస్ కారును దాదాపు 5,000 కిలోమీటర్లు నడిపారు. ఈ కారు లీటరుకు 23 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కారు రియల్ టైమ్ రేంజ్ 14 కి.మీ. ఎకో మోడ్, యాక్సిలరేషన్ క్యాప్‌తో ఈ కారు లీటరుకు 16కిలో మీటర్ల మైలేజీని ఇస్తుంది. అంటే ఈ ధర పరిధిలో ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ ఇతర పెద్ద MPVలు, SUVల కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది. ఈ కారులో ట్యాంక్ ను పూర్తిగా నింపితే 800 నుండి 900 కిలోమీటర్లు సులభంగా నడపవచ్చు.
ఇన్నోవా హైక్రాస్ Vs ఇన్నోవా క్రిస్టా
ఇన్నోవా క్రిస్టాతో పోల్చితే, హైక్రాస్ కొత్త హైబ్రిడ్ టెక్నాలజీ, మెరుగైన మైలేజ్, స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. నగరాల్లో తక్కువ వేగంతో కూడా నిశ్శబ్దంగా నడుస్తుంది.
టయోటా కారు డ్రైవింగ్ అనుభవం
టయోటా ఇన్నోవా హైక్రాస్ దాని హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ కారు ఇన్నోవా క్రిస్టా కంటే నడపడం సులభం. నగరాల్లో తక్కువ వేగంతో కూడా ఈ కారును చాలా సైలెంట్ గా నడుస్తుంది. తక్కువ వేగంతో కూడా ఈ కారు రైడ్ క్వాలిటీ మెరుగ్గా ఉంటుంది. ఈ కారు అప్రయత్నంగా మూడు అంకెల వేగాన్ని అందుకుంటుంది.
ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ లోపలి భాగం
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇంటీరియర్ గురించి చెప్పాలంటే.. ఈ కారు క్యాబిన్ కూడా చాలా బాగుంటుంది. ఈ కారులో కూర్చోవడానికి తగినంత స్పేస్ ఉంటుంది. టయోటా కారులో రెండవ వరుసలో కూడా తగినంత
స్పేస్ ఉంది. ఈ సిరీస్ కారులో ఇది చాలా బెస్ట్ అని చాలామంది అంటున్నారు. హైబ్రిడ్ కార్లు ఉత్తమ మైలేజీని ఇస్తాయని అంటారు.. దానికి నిదర్శనమే ఈ కారు. దీనితో పాటు డ్రైవ్ చాలా ఎంజాయ్ మెంట్ కలిగిస్తుంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ టెక్నాలజీ, ఉత్తమ మైలేజ్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవంతో భారతదేశంలో అత్యధికంగా డిమాండ్ ఉన్న కార్లలో ఒకటిగా నిలిచింది. దీని కోసం వేచి ఉండే సమయం పెరుగుతున్నా ప్రజలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.