Homeప్రత్యేకంMahindra Thar: అవి వరదల్లో చిక్కుకుంటే.. అది మాత్రం ఈజీగా ఒడ్డుకు చేరింది.. ఫార్చూనర్, స్కార్పియో,...

Mahindra Thar: అవి వరదల్లో చిక్కుకుంటే.. అది మాత్రం ఈజీగా ఒడ్డుకు చేరింది.. ఫార్చూనర్, స్కార్పియో, థార్‌ వాహనాలపై వీడియో వైరల్‌..

Mahindra Thar: ఉత్తర భారతదేశంలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు, భవనాలు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. రోడ్లు కనిపించడం లేదు. దీంతో ట్రాఫిక్‌ జామ్‌లు, నీటమునిగిన రోడ్లపై వాహనాలు నిలిచిపోవడం, కొట్టుకుపోవడం, నీటిలో తేలియాడడం లాంటి దృశ్యాలు సాధారణంగా కనిపిస్తున్నాయి. ఇంత వరదల్లోనూ ఓ క్రియేటర్‌ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రోడ్లపై వరదల్లో రెండు వాహనాలు నీటి మునిగిపోగా.. ఒక వాహనం మాత్రం రాజసంగా వరదను చీల్చుకుంటూ ఒడ్డుకు చేరింది. ఈ దృశ్యాలను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వీడియో వైరల్‌ అవుతోంది. వరదలో టయోటా ఫార్చూనర్, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా థార్‌ నీట మునిగిన రహదారిపై ఎలా పనిచేశాయో ఈ వీడియోలో ఉంది. ఈ వీడియోను ప్రతీక్‌సింగ్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేశారు.

నీట మునిగిన అండర్‌ పాస్‌ గుండా..
వీడియోలో కనిపిస్తున్న రోడ్డు నిజానికి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఎక్కడో ఉంది. నోయిడాతోసహా ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రహదారులు, అండర్‌పాస్‌లు నీటితో నిండిపోయాయి. నోయిడాలోని రోడ్డుపై కూడా పెద్ద ఎత్తున వరద చేరింది. రోడ్డు కొంతమేర మాత్రమే కనిపిస్తుంది. కార్లు, బైక్‌లు నీటిలో కొట్టుకుపోతూ, నీటిలో మునుగులూ కనిపించాయి. మారుతి డిజైర్‌ సెడాన్‌ నీళ్లలో నడవడం వీడియోలో కనిపిస్తుంది. కాసేపటికి సెడాన్‌ వెనుక భాగం తేలుతుంది. దీంతో డ్రైవర్‌ దానిని నడపలేకపోయాడు. రోడ్డుపక్కన ఉన్న స్థానికులు సెడాన్‌ను నీటిలో నుంచి బయటకు లాగారు. అదేవిధంగా టయోటా ఇన్నోవా, మారుతి స్విఫ్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌లు కూడా నీట మునగడంతో బయటకు తీశారు. ఈ వాహనాలు బయటకు తీశాక టయోటా ఫార్చూనర్‌ రోడ్డుపైకి చేరుకుంది. అయితే, నీటిని చూసి డ్రైవర్‌ ఆపి మరో మార్గంలో వెళ్లాడు.

కొంత దూరం నడిచిన స్కార్పియో..
ఇక మహీంద్రా స్కార్పియోఎన్‌ నీటిలోకి ప్రవేశించింది. మిడ్‌పాయింట్‌ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవర్‌ కారును నడిపించాడు. దీని తరువాత వెనుక భాగం నీటిలో తేలడం ప్రారంభించింది. దీంతో డ్రైవర్‌కు వాహనంపై నియంత్రణ లేకుండా పోయింది. ఆ వాహనాన్ని ఎలా బయటకు తీశారో మాత్రం వీడియోలో చూపలేదు. దీనిని కూడా స్థానికులే బయటకు లాగి ఉంటారు.
థార్‌ దాటేసింది..
చివరగా మహీంద్రా థార్‌ నీటిలో సులభంగా ప్రవేశించింది. ఈ వాహనం మాడిఫై చేసిన వామనంలా ఉంది. ఇది డ్రైవర్‌కు ఎలాంటి ఆందోళన లేకుండా వరదను దాటే ప్రయత్నంలో సహాయపడింది. మహీంద్రా థార్‌ నీటి వాడింగ్‌ సామర్థ్యం 650 మిమీ. దాని సామర్థ్యం గురించి డ్రైవర్‌కు తెలుసు. వరదను దాటేందుకు ప్రయత్నించని ఫార్చూనర్‌ 700 మి.మీ వాటర్‌ వాడింగ్‌ కెపాసిటీని కలిగి ఉంది. మహీంద్రా స్కార్పియో కేవలం 500 మి.మీ వాటర్‌ వాడింగ్‌ కెపాసిటీని కలిగి ఉంది.

నీటిలో నడపడం ఇబ్బందే..
నీరు నిలిచిన రహదారి గుండా డ్రైవింగ్‌ చేయడం సమస్యగా ఉంటుంది. ఇలా వరద పరిస్థితి వస్తే టొయోటా ఫార్చూనర్‌ చేసినట్లు మరో మార్గం ఎంచుకోవడం మంచింది. రోడ్డు దాటడానికి అతనికి సరైన వాహనం ఉన్నా అతను దానిని దాటకూడదని ఎంచుకున్నాడు. నీటి ద్వారా డ్రైవింగ్‌ చేసేటప్పుడు ప్రజలు ఎదుర్కొనే ఒక ప్రధాన సమస్య హైడ్రోలాకింగ్‌. గాలి తీసుకోవడం ద్వారా నీరు ఇంజిన్‌లోకి ప్రవేశించి ఇంజిన్‌ లాక్‌ అవుతుంది. తర్వాత నీరు తొలగించి డ్రై చేసే వరకు తిరిగి వామనం స్టార్ట్‌ చేయలేం. దీంతో అందులోని వారు కారులోనే కూరుకుపోయే ప్రమాదం ఉంది.

आज सामने आ गया REAL GANGSTER कौन 😱 SEE THE CAPACITY OF 3 LEGENDRY SUV'S

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version