https://oktelugu.com/

Pawan Kalyan vs CM Jagan : పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో కకావికలమవుతున్న జగన్ గ్యాంగ్

పాలన విధానం, వైఫల్యాలను ఎండగడుతున్నారు. ముఖ్యంగా జగన్ ఆయువుపట్టులపై ఫోకస్ పెంచారు. వచ్చే ఎన్నికల్లో ఏ వ్యవస్థల ద్వారా గట్టెక్కాలని చూస్తున్నారో వారినే టార్గెట్ చేసుకున్నారు,

Written By: , Updated On : July 12, 2023 / 07:08 PM IST
Follow us on

Pawan Kalyan vs CM Jagan : పవన్ కళ్యాణ్ ను చూసి జగన్ భయపడుతున్నాడు.. పవన్ ఆరోపణలు ప్రజల్లో బలంగా తాకుతున్నాయి. వైసీపీని షేక్ చేస్తున్నాయి. పవన్ అంతరంగం వైసీపీకి అంతుపట్టడం లేదు. రాజకీయ ప్రత్యర్థులకు అస్సలు మింగుడుపడడం లేదు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పవన్ మిగతా రాజకీయ పక్షాలను డిఫెన్స్ లో పడేస్తున్నారు.

వారాహి తొలి విడత యాత్రలో జనసేనకు ఓ అవకాశం ఇవ్వండని ప్రజలను కోరారు. సుపరిపాలన అందిస్తానని చెప్పుకొచ్చారు. రెండో విడతలో మాత్రం ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. పాలన విధానం, వైఫల్యాలను ఎండగడుతున్నారు. ముఖ్యంగా జగన్ ఆయువుపట్టులపై ఫోకస్ పెంచారు. వచ్చే ఎన్నికల్లో ఏ వ్యవస్థల ద్వారా గట్టెక్కాలని చూస్తున్నారో వారినే టార్గెట్ చేసుకున్నారు,

ప్రజా వ్యతిరేకత ఒక వైపు, చాలా వర్గాలు దూరం కావడం మరోవైపు జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయినా సరే గెలుస్తానన్న ధీమా జగన్ ది. అయితే ఈ ధీమా వెనుక ఉన్నది మాత్రం సంక్షేమ పథకాలే. 50 శాతం ఓటింగ్ వస్తుందని జాతీయ సర్వేలు ఘోషించినా కూడా జగన్ లో పవన్ అంటే భయం వీడడం లేదు. తాను అధికారానికి దూరమైన మరుక్షణం మీ పథకాలు నిలిచిపోతాయని ప్రజలకు ఓ రకమైన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ జగన్ చేశారు.

పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో కకావికలమవుతున్న జగన్ గ్యాంగ్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో కకావికలమవుతున్న జగన్ గ్యాంగ్ || Pawan Kalyan || CM Jagan || Ok Telugu