Toyota Century 2026: SUV కార్లను తీసుకురావడంలో Toyota ప్రత్యేకత చాటుకుంది. ఇప్పటికే ఎన్నో రకాల మోడల్స్ను మార్కెట్లోకి తీసుకువచ్చి అందరిని అలరించింది. అయితే ఇప్పుడు కొత్తగా నేటి తరం వారికి అనుగుణంగా కార్లలో తయారుచేసి రిలీజ్ చేస్తోంది. లేటెస్ట్ గా అమెరికన్ రోడ్లపై ప్రయాణం చేసేందుకు టయోటా Century మోడల్ ను అప్డేట్ చేసి మార్కెట్లోకి తీసుకురాబోతుంది. లగ్జరీ వినియోగదారులకు అనుగుణంగా దీనిని మార్చి త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతుంది.. ఈ కారు ఎలా ఉండబోతుందంటే?
Toyota Century 2026 ఎక్స్టీరియర్ డిజైన్ ఆకట్టుకునేలా ఆధునికతతో కూడుకొని ఉంది. దీని LED హెడ్లైట్స్ అందంగా తీర్చబడ్డాయి. ప్రీమియం లుక్ ను కలిగించే అల్లాయి వీల్స్, సూక్ష్మమైన క్రోమ్ టచ్, స్ట్రీమ్ lind రూఫ్ లైన్ వంటివి లాంగ్ డ్రైవ్ చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ మోడల్ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ ఇంజన్ ను కలిగి ఉంది. పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్ తో కలిసి ఇంజన్ స్మూత్ గా మూవ్ అవుతుంది. ఎలాంటి కర్బన్ ఉద్గారాలు విడుదల చేయకుండా పర్యావరణాన్ని కాపాడుతుంది. ఈ మోడల్ ఇన్నర్లో లగ్జరీ లుక్ ను కలిగి ఉంది. విభిన్న అందాన్ని అందించే సీటింగ్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్, మసాజింగ్ సీట్లు, ఎంటర్టైన్మెంట్ కోసం స్టీరింగ్ ఆడియో అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది.
అలాగే ఇందులో ఇంకోటైన్మెంట్ సిస్టం తో పాటు డ్రైవర్ డిజిటల్ డిస్ప్లే ఆకర్షణీయంగా ఉంటుంది. వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్, క్యాబిన్ కొత్తగా కనిపిస్తాయి. ఓవర్ ది టైల్స్ సాఫ్ట్వేర్ అప్డేట్, నావిగేషన్, కనెక్ట్ చేయబడిన సర్వీసెస్ సులభతరాన్ని అందిస్తాయి.. అడాప్టివ్ cruise కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్టు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటివి సేఫ్టీని ఇస్తాయి. ఇన్నర్ లో కావలసినంత స్పేస్ ఉండడంతోపాటు పార్కింగ్ సెన్సార్, 360 డిగ్రీ కెమెరా, లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన స్టీరింగ్ డ్రైవర్లకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.
2026 కొత్త సంవత్సరం సందర్భంగా అమెరికా ప్రజల కోసం రిలీజ్ అవుతున్న దీనిని 150,000 డాలర్లతో విక్రయించడం అన్నారు. ఆధారంగా లగ్జరీ ఫీచర్లతో పాటు.. ప్రత్యేకమైన ప్యాకేజీలు కావాలనుకునే వారికి ధర మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కొత్తగా SUV కొనేవారికి.. అలాగే లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన వెహికల్, లగ్జరీ ప్రయాణం చేయడానికి టయోటా Century బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. అంతేకాకుండా ఇందులోని ఇంటీరియర్ డిజైన్ కూడా ఆకట్టుకునే విధంగా ఉందని చెబుతున్నారు. ఇది మార్కెట్లోకి రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి అమ్మకాలు ఉంటాయో చూడాలి..