Indian Women Achievers : ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలను ఎక్కువగా మగవాళ్లే లీడ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కార్పొరేట్ ప్రపంచంలోకి మహిళలు కూడా ఎంటర్ అయ్యారు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదుగుతున్నారు. అందులో ఈ ముగ్గురికి సింహభాగం ఉంటుంది. అవకాశాలు వస్తే.. అందిపుచ్చుకొని మహిళలు ఏదైనా చేయగలరని వీరు నిరూపిస్తున్నారు.
సంధ్య దేవనాథన్, మెటా
మెటా కంపెనీకి సంబంధించిన ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ను ఇండియా నుంచి 50 కోట్ల మంది వాడుతుంటారు. మెటా కంపెనీకి ఇండియా అనేది అత్యంత కీలకమైన మార్కెట్. ఇక్కడి మార్కెట్ ను సంధ్య పర్యవేక్షిస్తున్నారు. ఈ విభాగానికి ఆమె 2022 నుంచి ఉప అధ్యక్షురాలి హోదాలో కొనసాగుతున్నారు. 2025 నుంచి ఆగ్నేయాసియా బాధ్యతలను కూడా ఆమె పర్యవేక్షిస్తున్నారు. విశాఖపట్నంలో సంధ్య చదువుకున్నారు. బీటెక్ కూడా అక్కడే పూర్తి చేశారు. ఎంబీఏ చదువును ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు. టెక్నాలజీ, పేమెంట్స్, బ్యాంకింగ్ రంగాలలో ఆమెకు దాదాపు పాతిక సంవత్సరాల అనుభవం ఉంది. సింగపూర్, వియత్నం ప్రాంతాలలో ఆమె పనిచేశారు. 2016లో మెటా కంపెనీలో చేరిన తర్వాత సింగపూర్, వియత్నాం దేశాల బాధ్యతలను మెటా కంపెనీ ఆమెకు అప్పగించింది. అక్కడ ఆమె విజయవంతంగా తన విధులను నిర్వర్తించారు. 2020లో ఆసియా పసిఫిక్ ప్రాంతాలలోని గేమింగ్ విభాగానికి ఆమె బదిలీ అయ్యారు. ఇక ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ లో మెటా కంపెనీకి భారతదేశం నుంచి అత్యధికంగా వినియోగదారులు ఉన్నారు. ఇన్ స్టా లో ఎక్కువ క్రియేటర్లు ఉన్న దేశం కూడా మనదే అని మెటా కంపెనీ చెబుతోంది. అందువల్లే సంధ్యను నియమించింది.
లక్ష్మీ అయ్యర్, బజాజ్ ఫిన్ సర్వ్
లక్ష్మీ అయ్యర్ కు బ్యాంకింగ్ రంగంలో విపరీతమైన అనుభవం ఉంది. అందువల్లే బజాజ్ ఫిన్ సర్వ్ గ్రూప్ ఆమెను వైస్ ప్రెసిడెంట్గా ఎంపిక చేసింది. లక్ష్మీ అయ్యర్ కోటక్ మహీంద్రా బ్యాంకులో ఫండ్ మేనేజర్ గా సుదీర్ఘ కాలం పని చేశారు. ఆమె పనితీరుకు మెచ్చి బజాజ్ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్, స్ట్రాటజీ విభాగానికి ఆమెను సీఈవో ని చేసింది. ఫైనాన్స్ సర్వీస్ లో లక్ష్మికి దాదాపు 27 సంవత్సరాల అనుభవం ఉంది. రియల్ ఎస్టేట్ మాత్రమే కాకుండా, వెల్త్ అడ్వైజరి వాటి అంశాలలో ఆమె విశేషమైన సేవలు అందించారు. నార్సీ మాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి ఆమె ఎంబీఏ పూర్తి చేశారు. రెండు సంవత్సరాలు పాటు ఉద్యోగ అనుభవం నేర్చుకున్నారు. ఆ తర్వాత కోడింగ్ నైపుణ్యాలను కూడా అందిపుచ్చుకున్నారు. 1999లో కోటక్ మ్యూచువల్ ఫండ్స్ సంస్థకు సాఫ్ట్వేర్ ను అందించే అవకాశాన్ని ఆమె దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆ సంస్థలో ఆమె అంచలంచెలుగా తన ప్రస్థానాన్ని స్థిరం చేసుకున్నారు. లక్ష్మి పనితనంతో ఆసియా ఇన్వెస్టర్ మ్యాగజిన్ ఈమెను టాప్ 25 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్ అని పేర్కొంది.
పూనం, ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇప్పటివరకు పురుషులదే ఆధిపత్యం. అయితే దానికి చరమగీతం పాడింది పూనమ్ గుప్త. ఢిల్లీలో ఆమె హిందూ కాలేజీ నుంచి బి ఏ ఎకనామిక్స్ చదువుకుంది. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మేరీ ల్యాండ్ నుంచి మాస్టర్స్, పి హెచ్ డి కూడా పూర్తి చేసింది. ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ మేరీ ల్యాండ్ లో విద్యార్థులకు పాటలు కూడా చెప్పారు. అనేక విద్యాసంస్థలలో అతిధి అధ్యాపకురాలిగా పనిచేశారు. అంతర్జాతీయ వాణిజ్య విషయాలలో ఈమెకు విపరీతమైన పట్టు ఉంది. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి సంస్థల్లో ఈమె రెండు దశాబ్దాల వరకు పనిచేశారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ కు డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. అంతేకాదు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి లో నాలుగు సంవత్సరాలుగా సభ్యురాలిగా కొనసాగారు. ఈ ఏప్రిల్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, పాలసీ రీసెర్చ్, మానిటరీ పాలసీ వంటి విభాగాలను ఆమె పర్యవేక్షిస్తున్నారు.