Tragic Honeymoon: వారిద్దరూ నూతన దంపతులు. పెళ్లి జరిగిన రోజుల వ్యవధిలోనే.. హనీమూన్ వెళ్లారు. ఎన్నో ఆశలతో ఏకాంతాన్ని ఆస్వాదించాలని అనుకున్నారు. తాము ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచినట్టుగా.. వారికి అనుకోని పరిణామం ఎదురైంది. ఈ ఘటనతో నూతన వధూవరుల కుటుంబాలు కలత చెందుతున్నాయి.
కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరానికి చెందిన సూరజ్ శివన్న (36), గణవి (26) అనే యువతని వివాహం చేసుకున్నాడు. వధువు బెంగళూరు నగరంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత శివన్న మహారాష్ట్రలోని నాగ్ పూర్ ప్రాంతంలో ఓ హోటల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ 29వ తేదీన వీరిద్దరికీ పెళ్లి జరిగింది. ఆ దంపతులు హనీమూన్ కోసం శ్రీలంక వెళ్లారు. అక్కడికి వెళ్లిన వారికి గొడవలు ఏర్పడ్డాయి. అర్థం గా వారిద్దరూ బెంగళూరు వచ్చారు. గణవి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత డిసెంబర్ 23న ఆమె ఆత్మ హత్యకు యత్నించింది. రెండు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది, కన్ను మూసింది. అత్తింటి వారి వద్ద ఆమెకు అవమానం ఎదురైందని.. తిరస్కారం వల్ల ఆత్మహత్య చేసుకుందామని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంతేకాదు సూరజ్ మీద గణవి కుటుంబ సభ్యులు వరకట్న వేధింపుల కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న సూరజ్ తన తల్లి జయంతి తో కలిసి బెంగళూరు విడిచిపెట్టి నాగ్ పూర్ ప్రాంతానికి వెళ్లిపోయాడు. వార్దా రోడ్ లో ఉన్న హోటల్లో అతడు ఉరివేసుకొని కన్నుమూశాడు. అతడి తల్లి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఆమెకు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వాస్తవానికి ఆ వధూవరుల మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ వారిద్దరూ రోజుల వ్యవధిలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.. సూరజ్ ఇలా ఆత్మహత్య చేసుకోవడాన్ని అతడి స్నేహితులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఉన్నత చదువులు చదివి.. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అతడు చిన్నపాటి గొడవకు ఇలా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరంగా ఉందని అతని స్నేహితులు చెబుతున్నారు. జరిగిన ఘటనపై లోతుగా దర్యాప్తు జరిపి.. నిందితుల పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అప్పుడే సూరజ్ ఆత్మ శాంతిస్తుందని వారు చెప్తున్నారు.. నిష్పక్షపాతంగా పోలీసులు దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.