Police Action On YCP Batch: ఏపీలో( Andhra Pradesh) పోలీసుల స్టైల్ మారుతోంది. అచ్చం ఉత్తరప్రదేశ్ లా సీన్ మారుతోంది. ఎవరైనా అతిగా వ్యవహరించి కావాలనే తప్పులు చేస్తే.. అదే ప్రాంతం నుంచి నడుచుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్తున్నారు పోలీసులు. అయితే ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్లో మాత్రమే ఇటువంటివి చూసేవాళ్ళం. మన రాష్ట్రంలో ఇటువంటివి చాలా అరుదు. అయితే నేరాలతో పాటు నేరాల ఉద్దేశం పెరుగుతుండడంతో.. ఏపీ పోలీసులు ఇలా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. కొందరు వ్యక్తులకు సంకెళ్లు వేసి రోడ్డుమీద తీసుకువెళ్లడం కనిపిస్తోంది. అయితే పోలీసుల వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుండడం చర్చకు దారితీస్తోంది. ఇలా అయితే నేరస్తులు ఏపీలో కొంతవరకు కట్టడి అవుతారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
పుష్ప డైలాగ్ తో రెచ్చిపోతూ..
పుష్ప సినిమాలో( Pushpa cinema) రఫ్ఫా రఫ్ఫా డైలాగు ఎంతో ఫేమస్ అయ్యింది. అయితే దానిని కాపీ కొట్టేశారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అరెస్టుల పర్వం నడుస్తున్న సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలు ఒక్కొక్కరు అరెస్టయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. తాము అధికారంలోకి వస్తే పుష్ప సినిమా మాదిరిగా రఫ్ఫా రఫ్ఫా అని చేసి చూపిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అతిగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి వారికి చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొంతమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన పనికి పోలీసులు తమదైన రీతిలో స్పందించారు.
వీధుల గుండా తీసుకువెళ్తు..
నల్లజర్ల ( nallajharla )మండలంలో జగన్మోహన్ రెడ్డి చిత్రపటం ఎదుట మేకపోతులను బలి ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. అయితే దీనిపై పోలీసులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. వారిని అరెస్టు చేసి వీధి మధ్యలో నుంచి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. మరి అంతకంటే అవమానం ఏమి ఉంటుంది. అచ్చం ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం లో పనిచేస్తున్న పోలీసుల తీరును గుర్తుకు తెచ్చింది ఈ ఘటన. అయితే ఇంతకుముందే ఓ గర్భిణీ స్త్రీపై వైసీపీ నేత తనడంపై కూడా ఇలానే స్పందించారు. జగన్ జన్మదినం నాడు ఇలాంటి జంతు బలి చేసిన వ్యక్తులకు సైతం ఇదే ట్రీట్మెంట్ ఇచ్చారు. పరిస్థితి చూస్తుంటే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన మాదిరిగా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఏపీలో ప్రారంభమైనట్టేనని అనిపిస్తోంది.
breaking news
ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని మరోసారి స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు..నల్లజర్ల మండలం ఈస్ట్–చోడవరం గ్రామంలో మాజీ సీఎం జగన్ ఫ్లెక్సీ ఎదుట ‘రప్పా–రఫ్ఫా’ అంటూ మేకపోతును బలి ఇచ్చిన ఘటనపై స్పందించిన పోలీసులు..
కొన్ని గంటల్లోనే నిందితుల అరెస్ట్…… pic.twitter.com/Ws8SaG3ytj— మన ప్రకాశం (@mana_Prakasam) December 27, 2025