Top SUV Cars: కారు కొనాలనుకునే చాలా మంది ఇటీవల SUV లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. విశాలమైన స్పేస్ తో పాటు హైబ్రిడ్ ఇంజిన్ ను కలిగిన ఎస్ యూవీలు లాంగ్ జర్నీకి సౌకర్యవంతంగా ఉంటాయి. ఎస్ యూవీ అనగానే చాలా మంది ఎక్కువ ధర ఉంటుందనే అభిప్రాయం ఉంది. కానీ ఇటీవల కొన్ని కార్లు లో బడ్జెట్ లో అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా ఇవి 5 స్టార్ రేటింగ్ కు సంపాదించుకున్నారు. దీంతో వీటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎగబడుతున్నారు. వాటిలోని టాప్ ఎస్ యూవీల గురించి వివరాల్లోకి వెళితే..
2023 -24 ఏడాది కార్ల విక్రయాల్లో 50 శాతం ఎస్ యూవీలే విక్రయించబడ్డాయి. వీటిలో టాటా నెక్సాన్ అమ్మకాలు అగ్రస్థానంలో ఉన్ానయి. ఈ కంపెనీ మొత్తం 1,71,697 యూనియట్లను విక్రయించింది. నెక్సాన్ తరువాత టాటా పంచ్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియోలు తరువాతి స్థానంలో ఉన్నాయి. వీటిలో టాటా నెక్సాన్ వివరాల్లోకి వెళితే.. ఈ మోడల్ 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లను కలిగి ఉంది. నెక్సాన్ ను రూ.8.15 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.15.80 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
దేశంలో కార్ల ఉత్పత్తిలో టాటా కంపెనీ రెండో స్థానంలో ఉంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయినా పంచ్ ఎస్ యూవీలో ద్వితీయ స్థానాన్ని సంపాదించుకుంది. టాటా పంచ్ 1.2 లీటర్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఈ వెహికల్ లీటర్ పెట్రోల్ కు 20.09 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో సీఎన్ జీ వెర్షన్ కూడా ఉంది. దీని ద్వారా 26.99 కిలోమీటర్ల మైలేజ్ పొందవచ్చు. దీనిని రూ.6 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.10.20 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
ప్రముఖ కార్ల కంపెనీ మారుతి హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీల వరకు మోడళ్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన బ్రెజ్జా 1.2 లీటర్ నేచుల్ ఆస్పిరేటేడ్ ఇంజిన్ ఉంది. ఇందులో 101 బీహెచ్ పీ పవర్ ఉత్పత్తి చేయగలదు.దీనిని రూ.8.34 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. బ్రెజ్జా తరువాతి స్థానంలో హ్యుందాయ్ క్రెటా వచ్చింది. ఈ కారు1.5 లీటర్ పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ అనే మూడు ఇంజిన్లను కలిగి ఉంది. దీనిని రూ.11 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.20.15 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఎస్ యూవీలు అత్యధికంగా ఉత్పత్తి చేసే మహీంద్రా నుంచి స్కార్పియో గత ఏడాది అమ్మకాల్లో టాప్ 5లో నిలిచింది. కంపెనీ నుంచి రిలీజ్ అయిన క్లాసిక్ కూడా అత్యధికంగా విక్రయాలు జరుపుకుంది. రెండు మోడళ్లు కలిపి 1,41,462 యూనిట్లు విక్రయించింది.