Site icon OkTelugu

NBK 109: బాలయ్య బాబీ కాంబోలో వస్తున్న సినిమా నుంచి లీక్ అయిన ఇంట్రెస్టింగ్ అప్డేట్…ఏంటంటే..?

Interesting update leaked from NBK 109

Interesting update leaked from NBK 109

NBK 109: నందమూరి నటసింహంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ నైతే క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు అనే విషయం మనకు తెలిసిందే అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

అది ఏంటి అంటే బాలయ్య బాబు ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే విషయం చాలామందికి తెలుసు… ఇక బాలయ్య ఈ సినిమాలోనే కాకుండా ఈ మధ్య చేస్తున్న ప్రతి సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో బాబీ,బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో డ్యూయల్ రోల్ కాదు త్రిబుల్ రోల్ చేస్తున్నాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే బాబీ ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ తో త్రిబుల్ రోల్ చేయించి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.

ఇక ఈ సినిమాలో కూడా బాలయ్య తో త్రిబుల్ రోల్ చేయించి ఈ సినిమాని కూడా సక్సెస్ తీరాలకు చేర్చడమే తన లక్ష్యంగా పెట్టుకోని ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే వరుసగా మూడు సక్సెస్ లతో మంచి ఊపు మీద ఉన్న బాలయ్యకు ఈ సినిమాతో తన ఖాతాలో మరో సక్సెస్ చేరుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఇక బాబీ కూడా ఇంతకు ముందు వాల్తేరు వీరయ్య సినిమా తో సక్సెస్ ను అందుకున్నాడు.

కాబట్టి ఇప్పుడు కూడా ఆ సక్సెస్ లను కంటిన్యూ చేస్తు ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే వీళ్ళ కాంబోలో వస్తున్న ఈ సినిమా విపరీతమైన అంచనాలను క్రియేట్ చేయడమే కాకుండా భారీ సక్సెస్ ని కూడా సాధించే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుందనే చెప్పాలి…

Exit mobile version