https://oktelugu.com/

Top 5 SUV Cars: కొత్తగా మార్కెట్లోకి 5 SUV కార్లు.. వీటి ఫీచర్లు ధర ఎలా ఉన్నాయంటే?

2024లో చాలా కంపెనీలు ఈవీలపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు వీటిని ప్రారంభించగా మరికొన్ని త్వరలో ప్రారంభించి మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధం అవుతున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : March 19, 2024 / 04:38 PM IST

    kia micro Suv

    Follow us on

    Top 5 SUV Cars: కారు కొనాలనుకునే ప్రతి ఒక్కరూ SUV కావాలని కోరుకుంటున్నారు. విశాలమైన స్పేస్, ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉండడంతో వీటిపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. అయితే ఈ SUVలు పెట్రో వేరియంట్ తో పాటు ఎలక్ట్రిక్ వెహికిల్స్ గా వస్తున్నాయి. ముఖ్యంగా 2024లో చాలా కంపెనీలు ఈవీలపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు వీటిని ప్రారంభించగా మరికొన్ని త్వరలో ప్రారంభించి మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధం అవుతున్నాయి. వీటిలో కొన్ని మోడళ్ల గురించి వివరాల్లోకి వెళితే..

    దేశంలో కార్ల ఉత్పత్తిలో మారుతి సుజుకీ ముందుండే ప్రయత్నం చేస్తుంటుంది. ఈ కంపెనీకి చెందిన స్విప్ట్ ఎవర్ గ్రీన్ గా నిలిచింది. దీని అమ్మకాలు ఇప్పటికే జోరందుకున్నాయి. ఈ మోడల్ అప్డేట్ అయి కొత్త వెర్షన్ లో ‘మారుతి న్యూజెన్ స్విప్ట్’ గా రాబోతుంది. దీనిని 2024 ఏప్రిల్ లో మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దీనిని జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించారు. ఈ కారులో 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉండనున్నాయి.

    కార్ల ఉత్పత్తిలో అగ్రస్థాయిలో ఉన్న కంపెనీల్లో హ్యుందాయ్ ఒకటి. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన క్రెటా ఈవీ వెర్షన్ ను కొత్తగా మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. దీనిని సెప్టెంబర్ లో విడుదల చేయనున్నారు. క్రెటా ఈవీ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 400 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో డ్యూయెల్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్ రూఫ్ వంటి అద్భుత ఫీచర్లు ఉన్నాయి.

    రెనాల్ట్ కంపెనీ గురించి చెప్పగానే డస్టర్ కారు గుర్తుకు వస్తుంది. ఈ డస్టర్ ఇప్పుడు అప్డేట్ అయి మార్కెట్లోకి రాబోతుంది. ఇది టర్బో, పెట్రోల్ మైల్డ్ హైబ్రీడ్ కాంబో ఆప్షన్లతో పాటు మూడు ఇంజిన్ వేరియంట్లతో లభించనుంది. దీని ధర రూ.10 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. 2024 డిసెంబర్ వరకు ఈ కారును రిలీజ్ చేసే అవకాశం ఉంది.

    మహీంద్రా అండ్ మహీంద్రా సైతం XUV300 ఫేస్ లిప్ట్ ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇప్పటికే ఇది ఇండియన్ రోడ్లపై కనిపించింది. ఇందులో డ్యూయెల్ స్క్రీన్ సెటప్ ను అమర్చారు. ఒకటి ఇన్ఫోటైన్మెంట్ సెటప్, మరొకటి ఇనుస్ట్రుమెంటల్ క్లస్టర్. దీని ధర రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉండే అవకాశం.

    టాటా కంపెనీ నుంచి కర్వ్ ను స్టాండ్ అవుట్ ఎస్ యూవీగా మారుస్తున్నారు. 2024లో డిసెంబర్ లో దీనిని లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ కారులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను అమరుస్తారు. మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంది.