Homeబిజినెస్Top 5 Dream Bikes for Youth: కుర్ర కారు మెచ్చే టాప్ 5 డ్రీమ్...

Top 5 Dream Bikes for Youth: కుర్ర కారు మెచ్చే టాప్ 5 డ్రీమ్ బైక్స్ ఇవే..

Top 5 Dream Bikes for Youth: ప్రస్తుత కాలంలో చాలామంది కుర్రాళ్ళు తమ బైక్ ఆకర్షనీయంగా ఉండాలని కోరుకుంటున్నారు. యూత్ కు మెచ్చే విధంగా కంపెనీలు సైతం డిఫరెంట్ లుక్ తో కొత్త కొత్త మోడల్స్ మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి. మొన్నటి వరకు పల్సర్, అపాచీ వంటివి మాత్రమే టెంప్ట్ చేసేవి. కానీ ఇప్పుడు కొన్ని కంపెనీలు అదిరిపోయే టూ వీలర్స్ను రిలీజ్ చేస్తున్నాయి. కంపెనీల మధ్య పోటీ ఉండడంతో వీటిని తక్కువ ధరకే అందిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో యూత్ బాగా మెచ్చే టాప్ 5 ట్రెండింగ్ బైక్స్ ఏవో తెలుసుకుందాం..

Hero కంపెనీ అనగానే స్ప్లెండర్ గుర్తుకు వస్తుంది. కానీ ప్రీమియం బైక్స్ ను తయారు చేయడంలోనూ ఈ కంపెనీ ప్రత్యేకత చాటుకుంటుంది. దీని నుంచి లేటెస్ట్ గా Xtreme 250 R త్వరలో రాబోతుంది. ఇందులో 249.03 ఇంజిన్ ఉండనుంది. ఇది 30 bhp పవర్ అందిస్తుంది. అలాగే 25 NM టార్క్ రిలీజ్ చేసి ఆకట్టుకుంటుంది. దీని లుక్ స్పెషల్ గా ఉండడంతో యువతకు బాగా నచ్చుతుంది.

Bajaj అనగానే పల్సర్ బైక్ గురించి చెప్పుకుంటారు. అయితే కొన్ని నీళ్లుగా పల్సర్ అప్గ్రేడ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా Pulsar NS400Z అనే బైక్ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. దీని ధర రూ.1.80 లక్షలు గా ఉండబోతుంది. ఇందులో 349 సిసి ఇంజన్ ఉండనుంది. ఈ ఇంజన్ 40.6 బిహెచ్పి పవర్ జనరేట్ చేస్తుంది.

Suzuki కంపెనీ నుంచి Jixer 250 అనే బైక్ లాంచ్ కాబోతోంది. దీనిపై రైడ్ చేస్తే ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ప్రీమియం బైక్ ను తలపించే దీని ధర రూ l.89 లక్షలు గా ఉంది. ఇందులో 249 సిసి ఇంజన్ ఉండగా.. ఇది 26.5 బీహెచ్పీ పవర్ ను అందిస్తుంది. స్పోర్ట్స్ బైక్ కావాలని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.

Triump అనే కంపెనీ సైతం కొత్త బైక్ ను లాంచ్ చేయబోతుంది. Speed T4 అనే మాడల్ యూత్ ను ఇంప్రెస్ చేస్తుందని అంటున్నారు. ఇందులో 349 సిసి ఇంజన్ ఉండగా.. ఈ ఇంజన్ 29 bhp పవర్ అందిస్తుంది. 31 NM టార్క్ రిలీజ్ చేసే దీని ధర రూ.1.95 లక్షలు గా ఉంది. ట్రాఫిక్ లో బయటపడడానికి ఇది బాగా సౌకర్యంగా ఉంటుంది.

KTM కంపెనీ నుంచి కొత్త Duke బైక్ రాబోతోంది. దీని ధర రూ.1.98 లక్షలు గా ఉంది. ఇందులో 199 సిసి ఇంజన్ ఉండబోతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version