Best Mileage Bikes: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత వ్యక్తిగత వాహనాల వినియోగం ఊహించని స్థాయిలో పెరిగింది. మనలో చాలామంది ప్రస్తుతం తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులపై దృష్టి పెడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో వాహనదారులు మైలేజ్ కు ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఉండటం గమనార్హం. బజాజ్ సీటీ 100 ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర 52,832 రూపాయలుగా ఉంది.
బజాజ్ సీటీ 100 మూడు వేరియంట్లలో నాలుగు రంగులతో మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ బైక్ లీటర్ పెట్రోల్ కు ఏకంగా 75 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండటం గమనార్హం. బజాజ్ ప్లాటినా 110 ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర 66,739 రూపాయలుగా ఉంది. 110 సీసీ-ఇంజిన్ ను కలిగి ఉన్న ఈ బైక్ ఈ బైక్ లీటర్ పెట్రోల్ కు ఏకంగా 72 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. హీరో సూపర్ స్ప్లెండర్ బైక్ తక్కువ ధరతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ లో ఒకటి.
10.6 బిహెచ్‌పి పవర్ ను కలిగి ఉన్న ఈ బైక్ 5 గేర్లతో 72,600 రూపాయలకు మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ బైక్ లీటర్ కు 75 కిలోమీటర్ల మైలేజ్ ను ఇస్తుంది. అయితే మరింత ఎక్కువ మైలేజ్ ను పొందాలని అనుకుంటే మాత్రం టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్ ను కొనుగోలు చేస్తే మంచిది. 3 వేరియంట్లు, 6 రంగులతో ఈ బైక్ మార్కెట్ లోకి అందుబాటులో ఉంది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర 68,475 రూపాయలు కావడం గమనార్హం.
తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ లో బజాజ్ పల్సర్ కూడా ఒకటి. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర 98,291 రూపాయలు కావడం గమనార్హం. సమీపంలోని బైక్ షోరూంలను సంప్రదించి ఈ బైక్ లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.