https://oktelugu.com/

India vs England: ఈరోజు నిలబడితేనే ఇంగ్లండ్ తో ఇండియా కలబడేది?

India vs England 4th test match:  ఇంగ్లండ్ తో జరుగుతున్న 4వ టెస్టులో ఇండియాకు ఈరోజు అత్యంత కీలకం. ఎందుకంటే టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన ఇండియా కేవలం 191 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయ్యింది. బ్యాట్స్ మెన్ వైఫల్యం మరోసారి కనిపించింది. అదే సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు తడబడ్డా పట్టుదలతో ఆడి ఏకంగా 290 పరుగులు సాధించింది. దీంతో దాదాపు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని ఇంగ్లండ్ సాధించింది. భారత […]

Written By: , Updated On : September 5, 2021 / 01:18 PM IST
Follow us on

India vs England 4th test match:  ఇంగ్లండ్ తో జరుగుతున్న 4వ టెస్టులో ఇండియాకు ఈరోజు అత్యంత కీలకం. ఎందుకంటే టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన ఇండియా కేవలం 191 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయ్యింది. బ్యాట్స్ మెన్ వైఫల్యం మరోసారి కనిపించింది. అదే సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు తడబడ్డా పట్టుదలతో ఆడి ఏకంగా 290 పరుగులు సాధించింది. దీంతో దాదాపు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని ఇంగ్లండ్ సాధించింది.

భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో మొదటి ఇన్నింగ్స్ లాగానే కుప్పకూలితే ఓటమి తప్పదు కానీ.. భారత్ రెండో ఇన్నింగ్స్ లో 99 పరుగులు వెనుకబడి బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా నిలబడింది. రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్లు సత్తా చాటారు. రోహిత్ శర్మ 127 పరుగులతో సెంచరీతో కదం తొక్కగా.. కేఎల్ రాహుల్ 46 పరుగులతో రాణించాడు. తర్వాత వచ్చిన చెతశ్వర్ పూజారా సైతం 61 పరుగుల విలువైన భాగస్వామ్యం నెరపడంతో ఇండియా నిలబడింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 22, రవీంద్రజడేజా 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మూడు రోజులు ఆట పూర్తయ్యింది. ఇంకా రెండు రోజులు ఉంది. 4వ రోజు అయిన ఈరోజు కోహ్లీ, రహానే, పంత్ లలో ఎవరో ఒకరు నిలబడి 400 పరుగులు దాటిస్తేనే ఇండియా విజయం సాధిస్తుంది. ఆఖరి రోజు ఇంగ్లండ్ ను కూప్పకూల్చితే భారత్ కు విజయం తధ్యం. అది జరగాలంటే ఈరోజు విరాట్ కోహ్లీ సహా భారత బ్యాట్స్ మెన్ రాణించడం చాలా అవసరం. ప్రస్తుతం 171 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఎంతలేదన్నా కనీసం 300 పైచిలుకు ఆధిక్యాన్ని సాధించగలిగితే ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలదు. ఒత్తిడిలోకి నెట్టగలదు.

4వరోజు ఇండియా బ్యాటింగ్ చేసే సామర్థ్యమే ఈ మ్యాచ్ లో గెలుపు ఇంగ్లండ్ దా? లేక ఇండియాదా? అన్నది డిసైడ్ చేస్తుంది. దీంతో భారత బ్యాట్స్ మెన్ రాణింపుపైనే విజయం ఆధారపడి ఉంది.

Rohit Shines for India! | England v India - Day 3 Highlights | 4th LV= Insurance Test 2021