Top 3 Cars In India : అమ్మకాల్లో రారాజులు ఈ కార్లు.. దేశంలో టాప్ 3 కార్లు ఇవే..

దేశంలో దశాబ్దాలుగా మారుతి సుజుకి కార్ల అమ్మకాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంటోంది. ఈ కంపెనీతో మిగతావి పోటీ పడుతున్నాయి

Written By: Chai Muchhata, Updated On : January 30, 2024 11:05 am

Top 3 cars sailing in India

Follow us on

Top 3 Cars In India :కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో కంపెనీలు వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. దేశంలో దశాబ్దాలుగా మారుతి సుజుకి కార్ల అమ్మకాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంటోంది. ఈ కంపెనీతో మిగతావి పోటీ పడుతున్నాయి. కొత్త కొత్త ఫీచర్లను అమరుస్తూ లేటేస్ట్ మోడళ్లను ఆవిష్కరిస్తున్నాయి. ఈ తరుణంలో 2023 ఏడాదిలో పోటీ పడి కంపెనీలు తమ కార్లను విక్రయించుకున్నాయి. మారుతి కంపెనీని బీట్ చేసేందుకు ప్రయత్నించిన మిగతా కంపెనీలు ఏవో తెలుసా?

2023 ఏడాదిలో కార్ల విక్రయాలు జోరుగా పెరిగాయి. ఈ ఏడాదిలో 40 లక్షల కార్లు విక్రయాలు జరుపుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇలా అమ్మకాలు జరుపుకున్న కంపెనీల్లో మారుతి సుజుకి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ గత ఏడాది 20 లక్షల యూనిట్లు అమ్మకాలు జరుపుకుంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి 7.76 లక్షలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే నెలకు 1.5 లక్షల యూనిట్లను విక్రయించారు.

మారుతి కంపెనీతో పోటీ పడుతూ అత్యధిక విక్రయాలు జరుపుకుంది హ్యుందాయ్. ఈ కంపెనీ నుంచి 2023 ఏడాదిలో 7.65 లక్షల కార్లను విక్రయించింది. ఇదే కంపెనీ 2022లో 7.0 లక్షలు అమ్మకాలు జరిపింది. 2022 కంటే 2023 లో కంపెనీ అమ్మకాలు 9 శాతం వృద్ధి సాధించాయి. మొత్తం విక్రయించిన వాటిలో హ్యుందాయ్ దేశీయంగా 6.02 లక్షలు సేల్స్ చేసింది. వీటితో పాటు టాటా మోటార్స్ కార్ల అమ్మకాల్లో పోటీ పడింది. 2023లో ఈ కంపెనీ మొత్తం 5.53 లక్షల యూనిట్లు విక్రయించింది. ఈ కంపెనీ నుంచి ఎస్ యూవీ, హ్యాచ్ బ్యాక్ కార్ల పనితీరు మెరుగుపర్చడంతోనే అమ్మకాలు ఎక్కువగా జరుపుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

రోజురోజుకు కార్ల వినియోగం పెరిగిపోవడంతో కంపెనీలు పోటీ పడి ఉత్పత్తి చేస్తున్నాయి. నేటి కాలంలో ఎక్కువగా ఎస్ యూవీలను కోరుకుంటున్నారు. అయితే కొన్ని కంపెనీలు హ్యాచ్ బ్యాక్ ల్లోనూ అప్డేట్ ఫీచర్స్ ను అమర్చి మార్కెట్లోకి తెస్తున్నారు. దీంతో అమ్మకాలు పెరుగుతున్నాయని అనుకోవచ్చు.