Mr Bachchan: మిరపకాయ సినిమా సీన్స్ మిస్టర్ బచ్చన్ సినిమాలో ఉన్నాయా?

మిస్టర్ బచ్చన్ సినిమాను బాలీవుడ్ సినిమా నుంచి రీమేక్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇందులో చాలా మార్పులు చేసినట్టుగా టాక్. ఇక ఈ సినిమాతో సక్సెస్ కొట్టి రాబోయే సినిమాలను కూడా సక్సెస్ ని కంటిన్యూ చేయాలని చూస్తున్నారు రవితేజ.

Written By: Swathi, Updated On : January 30, 2024 11:06 am
Follow us on

Mr Bachchan: కొన్ని కాంబినేషన్ లు ఇండస్ట్రీలో మంచి హిట్ ను అందుకుంటాయి. ఆ కాంబోలో సినిమాలు రావాలని అందరూ ఎదురుచూస్తుంటారు. అయితే రవితేజ, హరీష్ శంకర్ కాంబోకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరి కాంబోలో సినిమా రావాలని ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. గతంలోనే మిరపకాయ సినిమా వచ్చి కమర్షియల్ హిట్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం మరో సినిమాతో ఈ కాంబో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే మిస్టర్ బచ్చన్ సినిమా. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మిస్టర్ బచ్చన్ సినిమాను బాలీవుడ్ సినిమా నుంచి రీమేక్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇందులో చాలా మార్పులు చేసినట్టుగా టాక్. ఇక ఈ సినిమాతో సక్సెస్ కొట్టి రాబోయే సినిమాలను కూడా సక్సెస్ ని కంటిన్యూ చేయాలని చూస్తున్నారు రవితేజ. ఎందుకంటే ముందుగా వచ్చిన మిరపకాయ కూడా హిట్ అవడంతో ఈ సినిమా పై మాస్ రాజా మంచి అంచనాలు పెంచుకున్నారట. అంతేకాదు హరీష్ శంకర్ కూడా ఇదే భావిస్తున్నారట. అందుకే సినిమాను మొత్తం కమర్షియల్ హంగులతో నింపేసినట్టు టాక్.

హరీష్ శంకర్, రవితేజ కాంబోలో సినిమా అంటే కచ్చితంగా మంచి అంచనాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ల సినిమాల్లో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. అందరిని ఆకట్టకునేలా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటారు కూడా. అయితే వీరిద్దరు కూడా పెద్దగా ఫామ్ లో లేకపోవడంతో ఎలాంటి సక్సెస్ ను అందుకుంటారో అని వీరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను చేస్తున్నారు. దాని నుంచి బ్రేక్ టైంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

మరి ఈ సినిమా ఇద్దరికి సక్సెస్ ను ఇస్తుందా లేదా అనే టెన్షన్ కూడా అందరిలో ఉందట. ఇదిలా ఉంటే మిరపకాయ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ ను కూడా ఈ సినిమాలో ఇన్ క్లూడ్ చేశారట. మరి ఈ సీన్స ను సినిమా స్టోరికి అనుగునంగా యాడ్ చేశారా? కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం వాడుతున్నారా అనే విషయం క్లారిటీ లేదు. సినిమా రిలీజ్ తర్వాత ఈ విషయం అర్థం అవుతుందేమో..అంటే అప్పటి వరకు వేచి ఉండాల్సిందే.