Today Gold Rate: శ్రావణమాసం వేళ బంగారం ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. గతంలో లక్ష రూపాయలకు పైగా పెరిగిన బంగారం ధరలు ఆ తర్వాత మళ్లీ తగ్గుతూ వచ్చాయి. అయితే శ్రావణమాసం ప్రారంభం అయిన తర్వాత బంగారం ధరలు తగ్గుముఖం పడుతూ ఉండడంతో చాలామంది హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పండుగలు కూడా రావడంతో బంగారం కొనుగోలు చేయాలని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా బంగారం ధరలు పెరిగిపోయాయి. అందులోనూ మహిళలు ఎక్కువగా కొనుగోలు చేయాలనుకునే వరలక్ష్మీ వ్రతం రోజునే బంగారం ధరలు పెరగడంపై ఆందోళన చెందుతున్నారు. గో శుక్రవారం ఒక్కసారిగా బంగారం ధరలు భారీగా పెరగడంతో కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. మరి ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
Also Read:రేవంత్ శత్రువును చంపలేదు.. ఓడించాడు
బులిటెన్ మార్కెట్ ప్రకారం.. శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.94,700 గా నమోదయింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,03,310 కి చేరింది. గురువారం కంటే బంగారం ధరలు శుక్రవారం రూ.700 పెరిగింది. అయితే వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.94,850.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,03,460 పలుకుతోంది. అలాగే ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.94,700.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,03,310 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.94,700.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,03,310 పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.94,700.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,03,310 పలుకుతోంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.94,700.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,03,310 పలుకుతోంది.
వెండి ధర ప్రస్తుతం రూ.1, 27,000 గా నమోదు అయింది. అయితే శ్రావణమాసంలో తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. దీంతో బంగారం, వెండి కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం బంగారం ధర అధికం కావడంతో చాలామంది వెండి కొనుగోలు పై ఆసక్తి చూపుతున్నారు. అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగానే బంగారంపై పెట్టుబడులు ఎక్కువగా పెడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి కి డిమాండ్ ఉన్నప్పటికీ.. ధరల కారణంగా కొనుగోళ్ల శాతం తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఈ బంగారం ధరలు ఇలాగే పెరుగుతాయా? లేదా మరోసారి తగ్గుతాయా? అనేది చూడాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా వివాహా కార్యక్రమాలు ప్రారంభం కానందున బంగారం కొనుగోలు తక్కువగా ఉంటున్నాయి. పెళ్లిళ్లు ఎక్కువగా జరిగితే బంగారం, వెండి కొనుగోళ్ల శాతం పెరుగుతుంది.