Tiago vs Wagon R :భారతీయ మార్కెట్‌లో టాటా టియాగో, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్‌లకు మంచి డిమాండ్ ఉంది. టాటా టియాగో ప్రారంభ ధర రూ.5 లక్షలు (ఎక్స్-షోరూమ్).. దీని టాప్ వేరియంట్ ధర రూ.7.5లక్షల వరకు ఉంటుంది. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ధర రూ.5.78 లక్షల నుండి ప్రారంభమై టాప్ మోడల్‌కురూ.7.50 లక్షల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్).
ధరల పరంగా చూస్తే టాటా టియాగో బేస్ మోడల్ వ్యాగన్ ఆర్ కంటే చౌకైనదని తెలుస్తోంది. బడ్జెట్ చాలా పరిమితంగా ఉంటే.. ఎంట్రీ-లెవెల్ హ్యాచ్‌బ్యాక్‌ను కొనాలనుకుంటే.. టాటా టియాగో బెస్ట్ ఆప్షన్ కావచ్చు. రెండు కార్లు పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.
ఫీచర్లు, టెక్నాలజీ ఎలా ఉన్నాయి?
టాటా టియాగో తన బేస్ వేరియంట్‌లో కూడా పవర్ ఫుల్ ఫీచర్లను అందిస్తుంది. అవి 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (హైయర్ వేరియంట్‌లలో 10.25 ఇంచుల ఆప్షన్ కూడా ఉంది), 8-స్పీకర్ హార్మన్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ, 15-ఇంచుల అల్లాయ్ వీల్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, LED DRLలు, రియర్ పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి. టియాగో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రీమియం సీట్ అప్‌హోల్‌స్టరీ కూడా యూత్ లో దీనికి మంచి క్రేజ్ తెచ్చి పెట్టాయి.
Also Read : వ్యాగన్ ఆర్ వర్సెస్ టియాగో.. ఎందుకు?
మరోవైపు, మారుతి వ్యాగన్ ఆర్‌లో కూడా 7-ఇంచుల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 4-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 14-అంగుళాల అల్లాయ్ వీల్స్, డ్యూయల్-టోన్ ఇంటీరియర్ వంటి మంచి ఫీచర్లు ఉన్నాయి. దీని టాప్ వేరియంట్‌లో స్మార్ట్‌ప్లే స్టూడియో ఇన్ఫోటైన్‌మెంట్, డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్ కూడా ఉంది. అయితే ఫీచర్ల విషయంలో టాటా టియాగో కొంచెం ప్రీమియం ఎక్స్ పీరియన్స్ కలిగిస్తుంది. టెక్నికల్ గా మాట్లాడితే వ్యాగన్ ఆర్ కంటే ముందున్నట్లు కనిపిస్తుంది.
టాటా టియాగో పెట్రోల్ వేరియంట్ మైలేజ్ లీటరుకు 19-20 కిమీ. దీని CNG వేరియంట్‌లో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కిలోకు 26.49 కిమీ, AMT ట్రాన్స్‌మిషన్‌తో లీటరుకు 28.06 కిమీ అద్భుతమైన మైలేజ్ లభిస్తుంది. ముఖ్యంగా CNG వేరియంట్‌లో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ఉండడం ఈ సెగ్మెంట్‌లో చాలా స్పెషల్. మరోవైపు, మారుతి వ్యాగన్ ఆర్ పెట్రోల్ వెర్షన్ లీటరుకు 25.19 కిమీ మైలేజ్ ఇస్తుంది. సీఎన్జీ వేరియంట్‌లో కిలోకు 34.05 కిమీ వరకు పెరుగుతుంది. అయితే వ్యాగన్ ఆర్ CNG వెర్షన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది. కేవలం మైలేజ్ గురించి మాట్లాడితే.. వ్యాగన్ ఆర్ CNG ఈ సెగ్మెంట్‌లో అత్యధిక మైలేజ్ ఇస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఇది బాగుంటుంది.