Gold Prices: బంగారం కొనాలనుకునేవారికి షాక్ న్యూస్ . గత రెండు రోజులగా తగ్గుతున్న బంగారం ధరలు మరోసారి పెరిగాయి. వెండి ధరలు కూడా స్పల్పంగా పెరిగాయి. దీంతో శుభకార్యాలు కార్యాలు నిర్వహించుకునేవారు ఆందోళన చెందుతున్నారు.
బులియన్ మార్కెట్ ప్రకారం.. డిసెంబర్ 19న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,400గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,620 గా ఉంది. డిసెంబర్ 18న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,400తో విక్రయించారు. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు రూ.100 పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,770గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,400 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,620 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,850 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,110తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,400 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,620తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,400తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,620తో విక్రయిస్తున్నారు.
బంగారంతో పాటు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.78,000గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.78,000గా ఉంది. ముంబైలో రూ.78,000, చెన్నైలో రూ.80,000, బెంగుళూరులో 75,750, హైదరాబాద్ లో రూ.80,000తో విక్రయిస్తున్నారు.