SUV : కారు కొనాలని అనుకునే వారు SUVలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. విశాలమైన స్పేస్ తో పాటు ఎత్తు ఎక్కువగా ఉండి ఆకర్షణీయంగా ఉంటుంది. అద్భుతమైన డ్రైవర్ అనుభూతి కలిగించే ఈ కార్లను కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా మార్కెట్లోకి తీసుకొస్తాయి. అయితే వీటి ధర ఎక్కువగా ఉండడంతో కొందరు కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తారు. ఈ తరుణంలో ఒక్కోసారి ఎస్ యూవీ కార్లపై ఆఫర్లను ప్రకటిస్తారు. పండుగలు, ప్రత్యేక దినాల్లో తగ్గింపు ధరతో విక్రయిస్తారు. అయితే తాజాగా ఓ కారు ధర రూ.14.99 లక్షలు ఉండగా.. కేవలం రూ.5.35 లక్షలకే ఇస్తామని ప్రకటించారు. ఈ విషయం తెలిసిన వారు చాలా మంది ఈ కారు కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?
దేశంలో మారుతి, టాటా కంపెనీలతో పోటీ పడుతోంది హ్యుందాయ్. దక్షిణ కొరియా కంపెనీకి చెందిన ఈ కంపెనీ నుంచి ఎక్కువగా ఎస్ యూవీలే మార్కెట్లోకి వచ్చాయి. దీంతో ఎస్ యూవీ కారు కొనాలని అనుకునేవారు హ్యుందాయ్ నుంచి సమాచారం తెలుసుకుంటూ ఉంటారు. హ్యుందాయ్ నుంచి రిలీజ్ అయిన క్రెటా గురించి కారు నడిపే వారికి తెలిసే ఉంటుంది. దీనిని రూ.10.99 లక్షల నుంచి రూ. 20.14 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇందులో 2017 మోడల్ రూ.14.99 లక్షలతో విక్రయిస్తున్నారు. అయితే ఈ కారు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నారు.
ఇలా ఎందుకు ఇస్తున్నారంటే.. ఇది యూజ్డ్ కారు. అంటే సెకండ్ హ్యాండ్ కారు. 2017 సంవత్సరానికి చెందిన క్రెటా సింగిల్ హ్యాండ్ మాత్రమే ఉపయోగించింది. కొన్ని కారణాల వల్ల దీనిని విక్రయిస్తున్నట్లు డ్రూమ్, కార్స్ 24 అనే వెబ్ సైట్లో ఉంచారు. డీజిల్ తో నడిచే ఈ కారు నోయిడా ప్రాంతంలో అందుబాటులో ఉంది. ఢిల్లీ రిజిస్ట్రేషన్ తో ఉన్న ఈ కారును 10 సంవత్సరాల పాటు నడుపుకోవచ్చు. అంటే 2027 వరకు దీనిని వాడుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ కారు 70 కిలోమీటర్లు నడిచినట్లు వివరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం కొత్త క్రెటా డీజిల్ వేరియంట్ రూ.14.99 లక్షలతో విక్రయిస్తున్నారు.కానీ దీనిని రూ.5.35 లక్షలకే ఇవ్వనున్నారు. హ్యాందాయ్ క్రెటా మోడల్ సక్సెస్ అయింది. ఎస్ యూవీ వేరియంట్ లో ఇదిమిగతా కార్లకు గట్టిపోటీ ఇస్తోంది. ఇలాంటి కారు సగం కంటే తక్కువ ధరకే ఇస్తున్నారంటే ఆలోచించొచ్చు.
బడ్జెట్ లో ఎస్ యూవీ కారును తీసుకోవాలంటే కష్టం అవతుుంది. అందువల్ల సెకండ్ హ్యాండ్ కారు కొనాలని చాలా మంది అనుకుంటారు. అయితే సింగిల్ డ్రైవ్ ఉన్న ఈ కారు ఉపయోగంగా ఉండనుంది. అయితే ఆన్ లైన్ లో కారును చూసి కొనుగోలు చేయొద్దు. మాన్యువల్ గా అన్ని చెక్ చేసుకోవాలి. వీలైతే మెకానిక్ కు చూపించి కారును కొనుగోలు చేయాలి. మరీ ముఖ్యంగా కారుకు సంబంధించిన పత్రాలు సరిగ్గా ఉన్నాయా? లేవా? చెక్ చేసుకోవాలి. లేకుంటే కొనుగోలు చేసిన తరువాత చాలా ఇబ్బందులు పడుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తఎస్ యూవీ కొనలేని వారు ఇలాంటి కార్లను కొనుగోలు చేయొచ్చు. కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.