https://oktelugu.com/

Ramya Krishnan Son: హీరోయిన్ రమ్యకృష్ణ కొడుకు లేటెస్ట్ ఫోటోలను చూసారా..? విజయ్ దేవరకొండ రేంజ్ లో ఉన్నాడుగా!

రమ్య కృష్ణ 1984 వ సంవత్సరంలో 'కంచు కాగడా' అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా ఆమెకి గుర్తింపుని తీసుకొని రాలేదు కానీ అవకాశాలను మాత్రం బాగానే తెచ్చిపెట్టింది.

Written By: , Updated On : November 27, 2024 / 01:36 PM IST
Ramya Krishnan Son

Ramya Krishnan Son

Follow us on

Ramya Krishnan Son: మన సౌత్ ఇండియా లో ఎంత వయస్సు పెరిగినా తరగని అందంతో ఇప్పటికీ చేతినిండా అవకాశాలతో దూసుకుపోతున్న నిన్నటి తరం హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో రమ్య కృష్ణ ఒకరు. అందం, నటన, డ్యాన్స్ ఇలా ఈ మూడిట్లో రాణించే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు ఈమె. ముఖ్యంగా లేడీ విలన్ పాత్రలకు ట్రెండ్ సెట్టర్ గా నిల్చింది రమ్య కృష్ణ. హీరోయిన్ గా కెరీర్ లో టాప్ స్టార్ గా దూసుకుపోతున్న రోజుల్లోనే ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘నరసింహా’ చిత్రంలో లేడీ విలన్ గా నటించి సంచలనం సృష్టించింది ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. రజినీకాంత్ ని కూడా డామినేట్ చేసే స్థాయిలో ఇందులో రమ్యకృష్ణ నటించింది. ఈ సినిమా తర్వాత రమ్య కృష్ణ స్థాయి హీరోయిన్ నెగటివ్ రోల్ చేసినప్పుడు మనమెందుకు చేయకూడదు అని పలువురు హీరోయిన్స్ ప్రయత్నం చేసారు. కానీ ఇప్పటి వరకు రమ్య కృష్ణ నటనను మ్యాచ్ చేయలేకపోయారు.

రమ్య కృష్ణ 1984 వ సంవత్సరంలో ‘కంచు కాగడా’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా ఆమెకి గుర్తింపుని తీసుకొని రాలేదు కానీ అవకాశాలను మాత్రం బాగానే తెచ్చిపెట్టింది. అలా 1987 వ సంవత్సరంలో మెగా చిరంజీవి హీరోగా నటించిన చక్రవర్తి అనే చిత్రంలో ఆయన చెల్లెలుగా నటించే ఛాన్స్ దొరికింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో రమ్య కృష్ణ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా హీరోయిన్ గా సూపర్ హిట్ సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. ఇండస్ట్రీ లోకి వచ్చిన ఐదేళ్లలోపే స్టార్ హీరోయిన్ గా నిల్చింది. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం లో కూడా ఈమెకు మంచి క్రేజ్ వచ్చింది. అక్కడి అగ్ర స్టార్ హీరోలందరి సరసన ఈమె హీరోయిన్ గా నటించి ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకుంది. రీసెంట్ సమయంలో ఆమెకి బాహుబలి సిరీస్ తెచ్చిన పేరు ప్రఖ్యాతలు మామూలివి కావు.

ఇక రమ్యకృష్ణ వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ ని ప్రేమించి పెళ్లాడింది. ఈ దంపతులిద్దరికీ రిత్విక్ వంశీ అనే కుమారుడు ఉన్నాడు. సోషల్ మీడియా లో రమ్య కృష్ణ ని అనుసరించే వాళ్లకు రిత్విక్ వంశీ సుపరిచితుడే. ఎప్పటికప్పుడు తన కొడుక్కి సంబంధించిన ఫోటోలను రమ్యకృష్ణ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. గత ఏడాది ఈయన రమ్య కృష్ణ ని ఒక ఇంటర్వ్యూ చేసాడు. ఈ ఇంటర్వ్యూ లో రిత్విక్ వంశీ ని చూసిన ప్రతీ ఒక్కరు ఇంత బాగున్నాడేంటి, ఇతన్ని సినిమాల్లోకి తీసుకొచ్చేయొచ్చు, విజయ్ దేవరకొండ లాగా సెన్సేషనల్ స్టార్ అవ్వగలడు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. మరి ఈయన సినిమాల్లోకి వస్తాడో లేదో చూడాలి.

 

Ramya Krishnan & Son First Interview | Ramya Krishnan Extreme Fun interview | IndiaGlitz Prime