దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ అధిక రాబడిని ఇచ్చే స్కీమ్స్ లో ఎల్ఐసీ జీవన్ శిరోమణి స్కీమ్ కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ పాలసీ తీసుకునే వాళ్లకు పాలసీ హామీ మొత్తం కోటి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఉంటుంది. 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఎల్ఐసీ పాలసీని తీసుకోవడానికి అర్హులు.
ఎల్ఐసీ డెత్ బెనిఫిట్స్ పై హామీ ఇచ్చిన మొత్తం వార్షిక ప్రీమియం కంటే 7 రెట్లు ఎక్కువగా ఉండే విధంగా లెక్కిస్తుంది. పాలసీ ప్రకారం అదనపు మొత్తం వసూలు చేసే ఛాన్స్ ఉండగా ప్రీమియంలలో ఎలాంటి పన్నులు ఉండవని తెలుస్తోంది. కనీసం సంవత్సరం ప్రీమియంను చెల్లించి పాలసీపై లోన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎల్ఐసీ జీవన్ శిరోమణి ప్లాన్ కింద లోన్ సదుపాయం అందుబాటులో ఉంది.
భీమా పథకాలపై చట్టాల ప్రకారం ఏవైనా పన్నులు ఉంటే ఆ చట్టాలను అనుసరించి పాలసీకి సంబంధించిన రాబడిపై పన్నులను విధించడం జరుగుతుంది.