https://oktelugu.com/

Wagon R Electric: విద్యుత్‌ వ్యాగన్‌ ఆర్‌ వచ్చేస్తోంది.. ఇప్పటికే మోడల్‌ ప్రదర్శన.. పేటెంట్‌కు దరఖాస్తు

ఇడబ్ల్యూఎక్స్‌ మోడల్‌ కారును భారత్‌లో ఈవీగా లాంచ్‌ చేస్తారని ప్రచారం జరగుతోంది. అయితే దీనిపై సుజుకీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం భారత్‌లో హైబ్రిడ్‌ వాహనాన్ని తీసుకొచ్చేందుకు మారుతీ సన్నాహాలు చేస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 23, 2024 6:49 pm
    Wagon R Electric

    Wagon R Electric

    Follow us on

    Wagon R Electric: జపాన్‌కు చెందిన వాహనాల తయారీ దిగ్గజం జుసుకీ ఈడబ్ల్యూఎక్స్‌ పేరుతో కారు కోసం పేటెంట్‌ దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. భారత్‌లో మారుతి సుజుకీ వ్యాగన్‌ ఆర్‌కు ఇది విద్యుత వర్షన్‌గా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 20వవాహన ప్రదర్శనలో జుజుకీ ఇడబ్ల్యూఎక్స్‌ మోడల్‌ను మొదటిసారి ప్రదర్శించింది. ఇది చూడడానికి వ్యాగర్‌ ఆర్‌ డిజైన్‌ను పోలి ఉంది. ముందువైపు సీ ఆకృతి లైట్‌ క్లస్టర్‌లు, ప్లాస్టిక్‌ క్లాడింగ్‌ కలిఇన బంపర్, చక్రాలు, పక్కన పసుపు షేడ్స్‌ ఉంటాయి. ఒకసారి చార్జింగ్‌తో ఇడబ్ల్యూఎక్స్‌ 230 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని సుజుకీ ఇంతకు ముందే ప్రకటించింది.

    భారత్‌లో ఈవీగా..
    ఇడబ్ల్యూఎక్స్‌ మోడల్‌ కారును భారత్‌లో ఈవీగా లాంచ్‌ చేస్తారని ప్రచారం జరగుతోంది. అయితే దీనిపై సుజుకీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం భారత్‌లో హైబ్రిడ్‌ వాహనాన్ని తీసుకొచ్చేందుకు మారుతీ సన్నాహాలు చేస్తోంది. 2025లో నెక్సా ఛానెల్‌ ద్వారా మొదటి విద్యుత్‌ కారు ఈవీఎక్స్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనిని ఒకసారి చార్జింగ్‌ పెడితే 550 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని సమాచారం.

    మెర్సిడెస్‌ బెంజ్‌ కొత్తకార్లు..
    ఇదిలా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల్లో రెండంకెల వృద్ధి ఆశిస్తున్నట్లు మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ప్రకటించింది హై ఎండ్‌ మోడళ్లకు అధిక గిరాకి ఉందని కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ లాన్స్‌ బెనెట్‌ తెలిపారు. భారత మార్కెట్‌లోకి లగ్జరీ మోడళ్లు, మేబాచ్‌ బీఎల్‌ఎస్‌ 600 4 మేటిక్‌ ఎస్‌యూవీ, ఏఎంజీ ఎస్‌ 64 పెర్ఫార్మెన్స్‌ ఎడిషన్‌ 1ను బుధవారం లాంbŒ∙చేసింది. వీటి ధరలు వరుసగా రూ.3.35 కోటుల రూ.3.3 కోట్లుగా ఉన్నాయి. ఈ ప్రత్యేక ఎడిషన్‌ ధర రూ.3.8 కోట్లు నుంచి ప్రారంభం అవుతుంది.