Anand Deverakonda: ఆనంద్, విజయ్ దేవరకొండలు మామూలోల్లు కాదు.. ఇంతకీ ఏం చేసేవారంటే..

ఆనంద్‌ ‘గం.. గం.. గణేశా’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. మే 31న ఈ చిత్రం థియేటర్ లలో సందడి చేయనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లలో బిజీ అయ్యారు మేకర్స్.

Written By: Swathi, Updated On : May 23, 2024 6:52 pm

Anand Deverakonda

Follow us on

Anand Deverakonda: టాలీవుడ్ స్టార్లు విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండల గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. విజయ్ దేవరకొండ తమ్ముడిగా పరిచయం అయినా ఆనంద్ దేవరకొండ రీసెంట్ గా వచ్చిన బేబీ సినిమాతో దుమ్ములేపాడు ఇద్దరూ కూడా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. తాజాగా విజయ్‌ మూడు సినిమాలు ప్రకటించగా.. ఆనంద్‌ ‘గం.. గం.. గణేశా’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. మే 31న ఈ చిత్రం థియేటర్ లలో సందడి చేయనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లలో బిజీ అయ్యారు మేకర్స్.

ఈ సందర్భంగా ఆనంద్‌ ప్రెస్‌మీట్‌లో ఓ ఆసక్తికర విషయాన్ని ఫోన్ ద్వారా విజయ్ పంచుకున్నారు. తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఎలా ఆటపట్టించే వారో చెప్పి అందరినీ నవ్వించారు. ఇక అన్నదమ్ముల వాయిస్‌ ఒకేలా ఉంటుంది. చిన్నప్పుడు తమ తల్లికి కూడా వారిలో ఎవరు పిలిచారో అర్థమయ్యేది కాదట. అంతేకాదు వీరి మా ఫ్రెండ్స్‌ను, గర్ల్‌ఫ్రెండ్స్‌ను కూడా వాయిస్ సేమ్ గా ఉండటం వల్ల చాలా ఆటపట్టించేవారట. విజయ్ మిత్రులు ఫోన్‌ చేస్తే ఆనంద్‌ మాట్లాడేవాడట. వారి ఫ్రెండ్స్ కూడా విజయ్ అనుకునేవారట.

ఇక కాలేజ్‌ డేస్‌లో ఇలా ఎక్కువగా ప్రాంక్స్ కూడా చేసేవారట.తన సినిమాలో ఆనంద్‌తో డబ్బింగ్‌ చెప్పించాలని ప్రయత్నించాడట విజయ్. ఇదెలా ఉంటే ‘గం.. గం.. గణేశా’ గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ట్రైలర్‌ చాలా బాగుందని అభినందించారు. ప్రీ రిలీజ్‌కు రావాలనుందని.. కానీ, వైజాగ్‌లో షూటింగ్‌ కారణంగా రాలేకపోతున్నాను అని తెలియజేశారు విజయ్.

ఇదెలా ఉంటే ‘గం.. గం.. గణేశా’ కామెడీ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బేబి’ లాంటి సూపర్ హిట్‌ తర్వాత ఆనంద్‌ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇది ఓ విగ్రహం చోరీ చుట్టూ తిరుగుతుందట. ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రగతి శ్రీ వాస్తవ హీరోయిన్ గా కనిపించనున్నారు. మరి ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాలి.