https://oktelugu.com/

Elon Musk: కలహాలు వద్దు.. కలిసిపోవడం ముద్దు.. మస్క్ వేలకోట్ల వ్యాపార రహస్యం ఇదే..

జూబ్లీహిల్స్ లో యాచకులు ఎక్కువగా ఉంటారు.. పెద్దమ్మ గుడి దగ్గర కూడా అదే స్థాయిలో ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు వాళ్ళ కలెక్షన్ వేలల్లో ఉంటుంది. సాయంత్రం కాగానే లెక్కలు పూర్తవుతాయి. అందరు సమంగా పంచుకొని ఇళ్లకు వెళుతుంటారు. అయితే వీరు ఒకరి దాంట్లో మరొకరు వేలు పెట్టరు. పైగా మీకు మీరు మాకు మేము అనే సూత్రాన్ని పాటిస్తారు. అంతిమంగా ఎంతో కొంత సంపాదించుకుంటూ పూట గడిపేస్తారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 13, 2024 / 08:08 PM IST

    Elon Musk

    Follow us on

    Elon Musk: ఎవరికి వారుగా ఉంటే విజయం సాధించే అవకాశం ఉండదు. ఐకమత్యంగా ఉంటే గెలుపులను సొంతం చేసుకోవచ్చు. వెనుకటి కాలంలో ఓ రాజు మంచానపడ్డాడు. రాజ్యం ఎవరికి ఇవ్వాలనే సందిగ్ధం ఆయనను వెంటాడుతూనే ఉంది. అయితే తన కుమారులకు ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. అడవికి వెళ్లి పది కర్రలు తీసుకురమ్మని చెప్పాడు. అందులో ఐదు కర్రలు ఒక్కొక్కరికి ఒక్కోటి ఇచ్చాడు. వాటిని విరగొట్టమని చెప్పాడు. ఆ కుమారులు కూడా అలానే చేశారు. ఈసారి ఐదు కర్రలను ఒక కట్టగా కట్టి వారికి ఇచ్చాడు. విరగొట్టమని చెప్పాడు.. అది సాధ్యం కాలేదు..” నేను ఇప్పుడు మంచం లో పడ్డాను. ఎంతకాలం బతుకుతానో తెలియదు. మీరు నాకు ఐదుగురు కుమారులు. మీరు అందరూ నాకు సమానమే. మీరు ఐకమత్యంగా ఉంటే ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీరు ఎవరికి వారుగా ఉంటే మాత్రం కష్టం. అది మీకు, రాజ్యానికి కూడా” అని ఆ రాజు ఉద్బోధించారు. ఆ తర్వాత ఆ ఐదుగురు ఐకమత్యంగా ఉండడం మొదలుపెట్టారు. రాజ్యాన్ని మరింతగా విస్తరించారు. పురాణ కాలంలో అంటే అలా జరిగింది.. నేటి కమర్షియల్ రోజుల్లో అది సాధ్యం కాదు. అలా ఉండడం వీలుకాదు. అయితే కొందరు వ్యాపారులు మాత్రం సంయుక్త సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు. స్థూలంగా చెప్పాలంటే దానిని ప్రిన్సిపు ల్ ఆఫ్ కంబైండింగ్ అంటారు. దీని ప్రకారం ఎలాంటి విపత్తునైన ఎదుర్కోవచ్చు. వ్యాపారాన్ని విస్తరించవచ్చు. ఈ సిద్ధాంతాన్ని ప్రస్తుతం ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అమల్లో పెట్టాడు విజయం సాధించాడు.

    అదే అతని విజయ రహస్యం

    ఇటీవల అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఆయన విజయంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలకపాత్ర పోషించారు. ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం 130 మిలియన్ డాలర్ల సహాయం అందించారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వాస్తవానికి టెస్లా అధినేత మస్క్ ప్రపంచ కుబేరుడు కావడానికి ముందు.. ఒక మామూలు ఎలక్ట్రానిక్ కార్ల తయారీదారు. ఆయన దగ్గర టెక్నాలజీ మాత్రమే ఉంది. కార్లను తయారుచేసే పెద్ద పెద్ద ప్లాంట్లు లేవు. అమెరికాలో పేరుపొందిన కార్ల తయారీ సంస్థ పోర్డ్ కంపెనీని మస్క్ గతంలో సంప్రదించారు. అప్పట్లో ఆ కంపెనీ నష్టాల్లో ఉంది. దీంతో మస్క్ తన దగ్గర టెక్నాలజీ ఉందని.. మీ దగ్గర కార్లు తయారు చేసే సత్తా ఉందని.. ఇద్దరం కలిస్తే గొప్పగా రాణించవచ్చని ఆఫర్ ప్రకటించారు. దానికి ఫోర్డ్ కంపెనీ ఒప్పుకుంది. ఫలితంగా మస్క్ టెస్లా రోడ్ల మీదకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా టెస్లా, ఫోర్డ్ కంపెనీలు సంయుక్తంగా కంబైన్డ్ చార్జర్ యూనిట్లు పెడుతున్నాయి. మొత్తంగా ఎలక్ట్రానిక్ కార్ల తయారీ మార్కెట్లోనే నెంబర్వన్ ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి సూత్రాన్నే మన తెలుగు నాట రెండు కార్పొరేట్ విద్యాసంస్థలు పాటించాయి. ఎక్కడ కూడా ఒక సంస్థను మరొక సంస్థ నాశనం చేసుకోవాలని కోరుకోలేదు. ఒకరి వ్యాపారంలో మరొకరు వేలు పెట్టలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే మనం ఎదగాలంటే ఒకరి సహకారం అవసరం.. మరింతగా విస్తరించాలంటే ఒకరి సహచర్యం అవసరం. మస్క్ చెప్తున్న వ్యాపార రహస్యం అదే.