Bhadradri Kothagudem: సరిగ్గా అలాంటి సంఘటనే తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో జరిగింది. ఈ కేసు కు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మణుగూరు మండలం తోగ్గూడెం ప్రాంతానికి చెందిన స్వాతి (32) అనే యువతి మాచినేని పెట్ట తండా చెందిన వీరభద్రాన్ని ఆరు సంవత్సరాలుగా ప్రేమిస్తోంది. వీరభద్రానికి పెళ్లికూడా అయింది. అయితే స్వాతిని ఏకంగా తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. భార్యతో కలిసి సంసారం సాగిస్తున్నాడు. భార్య ఈ విషయంపై నిలదీసినప్పటికీ వీరభద్రం వెనక్కి తగ్గలేదు. పైగా ఆమెపై పలుమార్లు భౌతికదాటికి దిగాడు. దీంతో భర్త పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఆమె భర్త చెప్పినట్టు విన సాగింది. అయితే కొంతకాలంగా వీరభద్రం, స్వాతి గొడవ పడుతున్నారు. అయితే ఇటీవల గొడవ తారా స్థాయికి చేరింది. దీంతో వీరభద్రం ఆవేశంలో ఈ నెల 9న స్వాతిని చంపేశాడు. ఆ తర్వాత ఆమెను ముక్కలు ముక్కలుగా నరికాడు. సమీపంలో ఉన్న తన పత్తి పొలంలో పాతిపెట్టాడు.
ఇలా వెలుగులోకి..
స్వాతి ఫోన్ కొద్దిరోజులుగా స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె కుటుంబ సభ్యులు వీరభద్రాన్ని నిలదీశారు. దీంతో అతడు పొంతన లేని సమాధానం చెప్పాడు. ఫలితంగా స్వాతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వీరభద్రాన్ని అదుపులోకి తీసుకొని వారి స్టైల్ లో విచారణ కొనసాగించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
16 లక్షలు తీసుకున్నారు
స్వాతి, వీరభద్రం గతంలో సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని ఓ జంట నుంచి 16 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం రాకపోవడంతో ఆ జంట మోసపోయామని భావించి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు అప్పుట్లో కేసు నమోదు చేశారు. ఇది మాత్రమే కాకుండా అనేక ఆర్థిక మోసాల కేసులో వీరభద్రం పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. అయితే ఆ జంట ఆత్మహత్య కేసులో వీరభద్ర పై పోలీసులు ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఆ జంట నుంచి తీసుకున్న 16 లక్షల విషయంలో స్వాతి వీరభద్రం మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. డబ్బుల విషయంలో స్వాతి పదేపదే అడగడం.. తనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో వీరభద్రానికి ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో నవంబర్ 9న వారిద్దరి మధ్య తారాస్థాయిలో గొడవ జరిగింది. దీంతో సహనం కోల్పోయిన వీరభద్రం స్వాతిని దారుణంగా కొట్టాడు. ఆ దెబ్బలకు ఆమె చనిపోయింది. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి తన పత్తి పొలంలో పాతిపెట్టాడు. స్వాతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. వీరభద్రం పత్తి పొలంలో పాతిపెట్టిన స్వాతి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసు కు సంబంధించి మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నామని జూలూరుపాడు ఎస్సై రాణా ప్రతాప్, సీఐ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు.