https://oktelugu.com/

మీ వాహనాన్ని ఇతరులకు ఇస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..?

ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గ్రేటర్ రహదారులపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పోలీసులు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో పాటు ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు జరగడానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధ్యయనం మొదలుపెట్టారు. ఈ అధ్యయనంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, ఓవర్ టేక్, ఓవర్ స్పీడ్ వల్ల ఎక్కువమంది ప్రమాదాల బారిన పడుతున్నట్టు వెల్లడైంది. రోడ్డు నిబంధనలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది ప్రమాదాల బారిన పడుతున్నారు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 11, 2021 / 01:54 PM IST
    Follow us on

    ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గ్రేటర్ రహదారులపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పోలీసులు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో పాటు ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు జరగడానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధ్యయనం మొదలుపెట్టారు. ఈ అధ్యయనంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, ఓవర్ టేక్, ఓవర్ స్పీడ్ వల్ల ఎక్కువమంది ప్రమాదాల బారిన పడుతున్నట్టు వెల్లడైంది.

    రోడ్డు నిబంధనలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది ప్రమాదాల బారిన పడుతున్నారు. కొంతమంది ఇతరుల వాహనాలను తీసుకుని రోడ్లెక్కి ప్రమాదాల బారిన పడుతున్నారు. పోలీసులు లైసెన్స్ లేని వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను ఇవ్వవద్దని సూచనలు చేస్తున్నారు. మైనర్లకు కూడా వాహనాలను ఇవ్వకూడదని చెబుతున్నారు. మైనర్లు వాహనం నడిపి పట్టుబడితే తల్లిదండ్రులు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.

    పోలీస్ అధికారులు గ్రేటర్ లో ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి అధ్యయనం చేసి డ్రైవింగ్ లైసెన్స్ లేనివాళ్లు ప్రధానంగా ప్రమాదాలకు కారణమవుతున్నారని గుర్తించారు. లైసెన్స్ లేనివాళ్లకు వాహనాలను ఇస్తున్న యజమానులపై కూడా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఇతరులకు వాహనాలను ఇచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు పడకుండా ఉండవచ్చు.

    లైసెన్స్ లేని వ్యక్తులకు, మైనర్లకు వాహనాలు ఇస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. చిన్న నిర్లక్ష్యం వల్లే దేశంలో పెద్ద సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి వాహనాలను అద్దెకు ఇచ్చినా కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశాలు అయితే ఉంటాయి