https://oktelugu.com/

Electric cars : అత్యంత చౌకైన టాప్ 4 ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. మైలేజ్ మాములుగా లేదుగా..

ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడిప్పుడే వస్తున్నందు వీటి ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అయితే వాటి ఫీచర్స్,ఇంజిన్ సామర్థ్యాలను బట్టి కొన్ని కార్లు మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్ ఎలక్ట్రిక్ ఈవీలు ఏవీ? వీటి ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి?

Written By:
  • Srinivas
  • , Updated On : August 13, 2024 / 11:16 AM IST

    Electric cars

    Follow us on

    Electric cars : దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల హవా సాగుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలు ఉన్నవారు సైతం వాటి స్థానంలో కొత్త ఈవీలను తీసుకుంటున్నారు. ఇప్పుడున్న వాహనాల కంటే విద్యుత్ కార్లు ఎక్కువగా ఉపయోగం ఉండడంతో పాటు లేటేస్ట్ టెక్నాలజీ ఫీచర్లు ఉండడంతో వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కొన్ని కార్ల కంపెనీలు సైతం మిగతా వాహనాల కంటే ఈవీల ఉత్పత్తిపైనే దృష్టి పెడుతున్నాయి. అంతేకాకుండా పాత వాహనాలను అప్డేట్ చేసిన ఈవీలుగా మార్చి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో పెట్రోల్ కార్లు తీసుకొస్తే ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తోంది. అయితే ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడిప్పుడే వస్తున్నందు వీటి ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అయితే వాటి ఫీచర్స్,ఇంజిన్ సామర్థ్యాలను బట్టి కొన్ని కార్లు మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్ ఎలక్ట్రిక్ ఈవీలు ఏవీ? వీటి ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి?

    టాటా కంపెనీ నుంచి చాలా వరకు ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో టాటా టిగోర్ బెస్ట్ మోడల్ గా నిలుస్తోంది. ఇది టాప్ లెవల్లో ఉంది. ఎకైక సెడాన్ ఎలక్ట్రిక్ కారుగా పేరొందిన ఈ కారు 26 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది. దీనిని ఛార్జింగ్ చేస్తే 315 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.దీనని చార్జింగ్ చేయడానికి 8 నుంచి 8.45 గంటల సమయం పడుతుంది. ఇది సేప్టీలో NCAP క్రాస్ టెస్టింగ్ లో 4 స్టార్ రేటింగ్ పొందింది. దీనిని రూ. 12.5 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

    సిట్రియెన్ కొంపెనీకి చెందిన కార్లు వినియోగదారులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ కంపెనీకి చెందిన సిట్రియెన్ సీ 3 కారు 29.2 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 320 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. డీసీ ఫాస్ట్ చార్జర్ తో 10.5 గంటల్లో ఛార్జింగ్ అవుతుంది. ఇందులో 10.2 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇన్నాయి. దీనిని రూ. 11.7 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

    టాటా కంపెనీకి చెందిన మరో కారు పంచ్. ఇది ఇప్పటికే ఎస్ యూవీ వేరియంట్ లో బెస్ట్ కారుగా నిలిచింది. అయితే దీనిని ఈవీగా మార్చి మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ లు ఉన్నాయి. ఒకటి 25 కిలో వాట్. ఇది 315 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మరొకటి 35 కిలో వాట్ బ్యాటరీ పాక్. ఇది 421 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ. 10.9 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

    టాటా టియాగో కారు సైతం వినియోగదారులను ఆకర్షిస్తోంది. దేశంలో అత్యంత చౌకైన కారుగా దీనిని పేర్కొంటారు. ఇది కూడా రెండు బ్యాటరీ ప్యాక్ లు కలిగి ఉంది. ఒకటి మీడియం రేంజ్ 19.2 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంది. టాప్ రేంజ్ 24 కిలో వాట్ ను కలిగి ఉండి 315 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ. 7.9 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

    MG కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారు అత్యంత చౌకైన కారు. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన కామెట్ ఎస్ యూవీగా గుర్తింపు పొందింది. దీనిని ఎలక్ట్రిక్ వెర్షన్ గా మార్చి మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇందులో 17.3 కిలోవాట్ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతో 230 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ బ్యాటరీ 57 గంటల్లో 100 శాతం వరకు ఛార్జింగ్ అవుతుంది. దీనిని రూ.6.90 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.