Budget Cars
Budget Cars: దశాబ్దం క్రితం వరకు కారు అంటే సంపన్నులదే. కానీ, కరోనా మనిషి జీవన శైలిని మార్చేసింది. ఎన్నో పాఠాలు నేర్పింది. ఈ నేపథ్యంలో అనేక మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో కారు ఇప్పుడు మధ్యతరగతికి అవసరంగా మారిపోయింది. మరోవైపు కాలంతోపాటు వేగంగా పరిగెత్తకపోతే పోటీ ప్రపంచంలో వెనుకబడిపోతామన్న భావన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కారు కంపల్సరి కొనాల్సిన పరిస్థితి. ఒకప్పుడు స్టేటస్ సింబల్ అయిన కారు.. ఇప్పుడు కామన్ అయింది. అయితే కారు కొనాలని భావిస్తున్న మధ్యతరగతి ప్రజలు డబ్జెట్ అంచనా వేసుకుంటున్నారు. రూపాయి రూపాయి పోగు చేసుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం 2023లో బడ్జెట్ కార్లు ఉన్నాయంటున్నారు బిజినెస్ ఎక్స్‌పర్ట్స్. రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు కార్లు మిడిల్ క్లాస్‌కు బెస్ట్ ఆప్షన్ అని సూచిస్తున్నారు. మరి ఆ కార్లేంటో తెలుసుకుందాం.
మారుతి స్విఫ్ట్..
తక్కువ బడ్జెట్‌లో మూడు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లలో మారుతు స్విఫ్ట్ కారు మిడిల్ క్లాస్‌కు అందుబాటులో ఉంది. ఇందులో మొదటిది జెడ్‌ఎక్స్‌ఐ ఏఎంటీ. ఇది లీటర్‌కు 22 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ధర రూ.8.18 లక్షలు, రెండోది జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్. దీని ధర రూ.8.89 లక్షలు, మూడోది జెడ్‌ఎక్స్‌ఐ ప్లస్ డీటీ ఏఎంటీ. దీని ధర రూ.9.03 లక్షలు.
టాటా పంచ్..
దేశీయ కార్ల తయారీ కంపెనీ చాలా వరకు మిడిల్ క్లాస్‌ను దృష్టిలో పెట్టుకునే కార్లు తయారు చేస్తుంది. ఇందులో టాటా పంచ్ ఒకటి. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రో ఎస్‌యూవీ ఇది. ఈ రంసుపీ ఏఎంటీ ట్రాన్స్‌మిషన్‌లతో వివిధ రకాల అకాంప్లిష్డ్, క్రికేటివ్ వేరియంట్‌లను అందిస్తుంది. ఇందులో అకాంప్లిష్డ్ ట్రాన్స్‌మిషన్ విజయానికొస్తే టాటా పంచ్ కామో అకాంప్లిష్డ్ ఏఎంటీ ధర రూ.8.40 లక్షలు. అకాంప్లిష్డ్ డాజిల్ వేరియంట్ ధర రూ.8.78 లక్షలు. టాటా పంచ్ అకాంపల్లిష్డ్ ఎస్ ఏఎంటీ ధర రూ.8.85 లక్షలు, స్టాండర్డ్ అకాంప్లిష్డ్ ఎఎంటీ ధర రూ.8.35 లక్షలు, అకాంప్లిష్డ డాజిల్ ఎస్ ఏఎంటీ ధర రూ.9.25 లక్షలు, డీజిల్ వేరియంట్ ధర రూ.8.75 లక్షలు
క్రియేటివ్ వేరియంట్స్..
టాటా పంచ్ క్రియేటివ్ ఎస్ ఎఎంటీ డీటీ ధర రూ.9.80 లక్షలు.
క్రికేటివ్ ఏఎంటీ డీటీ ధర రూ.9.35 లక్షలు, అన్ని మోడల్ కార్లు లీటర్‌కు రూ.18.8 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయి.
హ్యుందాయ్ ఎక్స్‌టర్..
ఇటీవలే విడుదలైన మైక్రో ఎస్‌యూవీ హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారు. దేశంలో విశేష ఆదరణ పొందుతోంది. ఈ బేస్ మోడల్ కారుకు సంబంధించిన వేరియంట్లు చూస్తే..
ఎక్స్‌టర్ ఎస్ ఏఎంటీ – రూ.8.10 లక్షలు
ఎక్స్‌టర్ ఎస్‌ఎక్స్ ఏఎంటీ – రూ.8.77 లక్షలు
ఎక్స్‌టర్ ఎస్‌ఎక్స్ డీటీ ఏఎంటీ – రూ.9.02 లక్షలుస
ఎక్స్‌టర్ ఎస్‌ఎక్స్ ఓపీటీ ఏఎంటీ – రూ.9.41 లక్షలు
టాప్ – ఆఫ్ – ది – లైన్ ఎక్స్‌టర్ ఎస్‌ఎక్స్ ఆప్ట్ కనెక్ట్ ఏఎంటీ – రూ.10 లక్షలు
ఈ వేరియంట్ కార్లన్నీ1.2 లీటర్ ఇంజిన్, 19.2 కిలోమీటర్ల మైలేజీ కలిగి ఉంటాయి.
మారుతి ఫ్రాంక్స్..
మారుతి తన ప్రత్యేమైన క్రాస్ ఓవర్ మోడల్ ఫ్రాంక్స్‌లో రెండు వేరియంట్లను విడుదల చేసింది. ఆటోమేటిక్ ట్రాన్సమిషన్లతో అందిస్తోంది. అందులో మొదటిది ఫార్నెక్స్ డెల్టా ఎఎంటీ. దీని ధర రూ.8.88 లక్షలు. రెండోది ఫార్నెక్స్ డెల్టా ప్లస్ ఏఎంటీ. దీని ధర రూ.9.28 లక్షలు. ఈరెండు వేరియంట్లు 1197 సీసీ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇవి రెండు కూడా లీటర్‌కు 22.89 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయి.
టాటా టిగోర్..
టాటా టిగోర్ ఎక్స్‌జెడ్‌ఏ ప్లస్ ఏఎంటీ దీని ధర రూ.8.50 లక్షలు. ఇందులో మరొక వేరియంట్ టాటా టిగోర్ ఎక్స్‌జెడ్‌ఏ ప్లస్ లాథరెట్ ప్యాక్. దీని ధర రూ.8.60 లక్షలు. ఇవి రెండూ 19.6 కిలో మీటర్ల మైలేజీ ఇస్తాయి.
టాటా టియాగో ఈవీ..
టాటా టియాగో రెండు ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తోంది. మొదటిది టాటా టియాగో ఈవీ. దీని హ్యాచ్‌బ్యాక్ ఎస్‌ఈ బేస్, ఎక్స్‌టీ బేస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుది. వీటి ధరలు రూ. 8.69 లక్షలు, రూ. 9.29 లక్షలు. ఈ మోడల్స్ 19.2 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ కలిగి ఉన్నాయి. 250 కి.మీ మైలేజీ ఇస్తాయి. ఎలక్ట్రిక్ మోటార్ 60.34 బీహెచ్‌పీని ఉత్పత్తి చేస్తుంది.
ఎంజీ కమెట్ ఈవీ..
ఎంజీ కమెట్ ఈవీ జాబితాలో రెండు ఈవీలు ఉన్నాయి. కంపెనీ రూ.8.10 లక్షల ధర నిర్ణయించింది. ఎంజీ కమేట్ ఈవీ ప్లే, ఎంపీ కమేట్ ఈవీ ప్లస్ వేరియంట్లను అందిస్తోంది. రెండు మోడళ్ల ధర రూ.9.28 లక్షలు, 9.98 లక్షలుగా ఉంది. ఈ రెండు వాహనాలు 17.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కలిగి ఉంటాయి. ఒకే చార్జిపై 230 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. రెండు మోడళ్లకు పవర్ అవుట్ పుట్ 41.42 బీహెచ్‌పీ.
రెనాల్ట్ ట్రైబర్..
ఈ బడ్జెట్లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభించే ఏడు సీట్ల కారు ఇదొక్కటే. ఎంపీవీ రెనాల్ట్ ట్రైబర్. రెనాల్ట్ ట్రైబర్ ఆర్‌ఎక్స్‌టీ ఈజీ ఆర్ ఏఎంటీని అందిస్తోంది. దీని ధర రూ.8.12 లక్షలు. ఇది 999 సీసీ ఇంజిన్‌తో 18.2 కేఎంపీఎల్ ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది. ట్రైబర్ లైనప్‌లో ఏఎంటీ ట్రాన్‌సమిషన్‌లో ఉన్న వేరియంట్లు ఆర్‌ఎస్స్‌జెడ్ ఈజీ ఆర్ ఏఎంటీ. ఇవి. రూ.8.73 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. అర్బన్ నైట్ ఎడిషన్ ఏఎంటీ ధర రూ.8.89 లక్షలు. ఆర్‌ఎస్స్‌జెడ్ ఈజీ ఆర్ ఏఎంటీ డ్యూయల్ టోస్ వేరియంట్ ధర రూ.8.97 లక్షలు.
కియా సోనెట్..
కియాలో ఉన్న ఒకే ఒక్క డీజిల్ వర్షన్ సోనెట్. దీని ధర రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. మైలేజీ విషయానికి వస్తే 20 కిలోమీటర్లు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: These are the middle class budget cars
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com