Sriya Reddy: ప్రస్తుతం సలార్ సినిమా తనదైన రీతిలో సత్తాను చాటుతుంది. ఇక ఈ సినిమాలో నటించిన అందరూ కూడా ఈ సినిమా వల్ల చాలా ఫేమస్ అయిపోయారు. ముఖ్యంగా రాధా రామ క్యారెక్టర్ ని పోషించిన శ్రేయ రెడ్డి మాత్రం ఓవర్ నైట్ లో పాన్ ఇండియాలో స్టార్ నటిగా గుర్తింపు పొందింది. ఇక ఈ క్రమంలోనే ఈమె నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న ఓ జి సినిమాలో కూడా నటిస్తుంది. అయితే ఈ సినిమా మీద ప్రస్తుతం ఆమె విపరీతమైన వంచనాలను పెంచుతుంది ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాల్లో అభిమానులు ఎవరూ చూడలేని విధంగా ఆయన స్వాగ్ కానీ, ఆయన స్టైల్ గాని, మనం ఈ సినిమాలో చూడబోతున్నామంటూ చాలా కామెంట్లు చేస్తుంది. ఇక దాంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా మీద అంచనాలను విపరీతంగా పెంచేసుకుంటున్నారు.
సలార్ సినిమా ఎలా ఉందో దానికి రెండు మూడు రెట్లు ఓజి సినిమా అద్భుతంగా ఉండబోతుంది అంటూ చాలా కామెంట్లు చేస్తుంది. ఇక ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి… ప్రస్తుతం ఆమె సలార్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది. నిజానికి సలార్ సినిమాలో ఆమె పోషించిన పాత్ర మాత్రం అగ్రసివ్ క్యారెక్టర్ అనే చెప్పాలి.
ఒక లేడీ శివంగి లాగా తను రెచ్చిపోయి నటించి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన ఊపుతో ఆమెకు టాలెంట్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఈ సక్సెస్ తో ఆమె చాలా సినిమాల్లో నటించే అవకాశాలైతే తప్పకుండా వస్తాయి. ఇక బ్యాక్ టు బ్యాక్ ఓజీ సినిమా కూడా సక్సెస్ అయిందంటే ఆమె ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎదిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి…
ఇక ప్రస్తుతం ఈమె రాకతో మరొక కొత్త క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరికినట్టుగా అయింది.ఇక ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే ఇండస్ట్రీ లో ఉన్న ఆ ఐదరాగురిని మాత్రమే అటు ఇటు తిప్పెవారు కానీ ఈమె రాకతో మరొక కొత్త క్యారెక్టర్ ఆర్టిస్టు ఇండస్ట్రీ కి దొరికిన ఫీల్ అయితే అందరిలో కలుగుతుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ కలక్షన్స్ ని రాబడుతుంది కాబట్టి ఈమె కూడా పాన్ ఇండియా లెవెల్ లో నటి గా సూపర్ సక్సెస్ అయింది…