Top Mileage Bikes: పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ధరల ప్రభావం మధ్య తరగతి ప్రజల బడ్జెట్ అంచనాలను తలకిందులు చేస్తోంది. దీంతో ఇటీవల బైక్‌కు కొనడానికి కూడా భయపడుతున్నారు. ఇక కాస్త డబ్బులు ఉన్నవారు పెట్రోల్, డీజిల్ కార్లకు బదులు ఎల్‌పీజీ, ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేస్తున్నారు. ఇక ద్విచక్ర వాహనాదారులు బైక్‌లకు బదులు ఎలక్ట్రిక్ సైకిళ్లు కొంటున్నారు. ఈ తరుణంలో పేద, మధ్యతరగతికి కొన్ని బైక్‌లు ఊరటనిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
టీవీఎస్ స్పోర్ట్…
భారత దేశంలో ఎక్కువ మైలేజీ ఇస్తున్న బైక్‌లలో ఐదో స్థానంలో ఉంది టీవీఎస్ స్పోర్ట్. ఇది లీటర్‌కు 73 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది దీని ఎక్స్ షోరూం ధర రూ.61,601.
హీరో స్పెండర్ ప్లస్..
ఇది మైలేజీలో టీవీఎస్ స్పోర్ట్ కన్నా కాస్త మెరుగ్గా ఉంటుంది. ఇది లీటర్‌కు 81 కిలోమీటర్లు ఇస్తుంది. ఎక్స్ షోరూం ధర రూ.71,151
టీవీఎస్ స్టార్‌సిటీ ప్లస్..
ఇక మైలేజీలో మూడోస్థానంలో ఉంది టీవీఎస్ స్టార్‌సిటీ ప్లస్. ఇది లీటర్ పెట్రోల్‌కు 83 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ.78,770.
బజాజ్ సీటీ 100
ఇక దేశంలో మైలేజీలో రెండో స్థానంలో ఉంది బజాజ్ సీటీ 100. ఇది లీటర్‌కు 90 కిలోమీటర్లు. దీని ఎక్స్ షోరూం ధర రూ. 60 వేలు మాత్రమే.
బజాజ్ ప్లాటిన 100
దేశంలో అత్యంత ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్ బజాజ్ ప్లాటిన 100. ఇది లీటర్ పెట్రోల్‌కు 90 కిలోమీటర్లు నడుస్తుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ.66 వేలు మాత్రమే.