Nagarjuna: అప్పట్లో జనాలు మెచ్చే సినిమాలు తీసి సూపర్ సక్సెస్ లను అందుకున్న చిరంజీవి, తన సహచర నటులతో కూడా చాలా క్లోజ్ గా ఉండేవాడు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో హిట్లు, ఫ్లాపులు సాధారణం. కానీ ఎదుటి వ్యక్తితో మనం ఎలా ఉంటున్నాం అనే మన వ్యక్తిత్వమే ఇక్కడ శాశ్వతంగా మిగిలిపోతుందని చిరంజీవి చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాడు. అందుకే ఆయన ఈరోజుకి కూడా ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకొని ఇండస్ట్రీలోనే మెగాస్టార్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
అయితే చిరంజీవి తన సహచర నటుడు అయిన నాగార్జునతో చాలా క్లోజ్ గా ఉంటాడు. నాగార్జున కూడా చిరంజీవిని ఫ్రెండ్ లా కాకుండా బ్రదర్ లా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడే కాదు ఎప్పటినుంచో వీళ్లు మంచి స్నేహితులుగా ఉంటున్నారు. అయితే రాఘవేంద్రరావు చిరంజీవి తో ఘరానా మొగుడు అనే సినిమాని తెరకెక్కిస్తున్నప్పుడు, దానికి ముందే ఘరానా బుల్లోడు అనే స్టోరీని రాఘవేంద్ర రావు నాగార్జునకు చెప్పాడు.
దాంతో రాఘవేంద్రరావు చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ఘరానా మొగుడు సినిమా విషయం లో నాగార్జున తప్పుగా అర్థం చేసుకున్నాడు. రాఘవేంద్ర రావు నాకు చెప్పిన ఘరానా బుల్లోడు సినిమానే చిరంజీవితో తీస్తున్నాడు అని తనకు తానే అనుకొని, కొద్దిరోజుల పాటు చిరంజీవి, రాఘవేంద్ర రావుల మీద కోపంగా ఉన్నాడట,ఇక దాంతో అసలు విషయం తెలుసుకున్న చిరంజీవి అలాగే రాఘవేంద్ర రావు ఇద్దరూ కలిసి నాగార్జునతో నీకు చెప్పిన కథ ఇది కాదు. ఇది తమిళ్ సినిమాకి రీమేక్ గా చేస్తున్నాం. నికు చెప్పింది ఒరిజినల్ స్టోరీ అని రాఘవేంద్ర రావు చెప్పి, నీకు చెప్పిన స్టోరీ టైటిల్ ఘరానా బుల్లోడు, ఇది ఘరానా మొగుడు అని చెప్పడం తో నాగార్జున అసలు విషయాన్ని అర్థం చేసుకొని మళ్లీ చిరంజీవి తో సన్నిహితంగా ఉండటం స్టార్ట్ చేశాడట.
చిరంజీవిని నాగార్జున మిస్ అండర్ స్టాండింగ్ చేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య కొద్దిరోజులు గ్యాప్ అయితే పెరిగింది. అయితే చిరంజీవి మాత్రం ఆ గ్యాప్ ని ఫుల్ ఫిల్ చేయడంలో ఒక అడుగు ముందుకేసి నాగార్జున అపోహలకి క్లారిటీ ఇచ్చాడు…ఇలా చిరంజీవి ప్రతి విషయం లో అందరితో చాలా క్లారిటీ గా ఉంటాడు. అయితే ఆ తర్వాత రాఘవేంద్ర రావు నాగార్జున తో ఘరానా బుల్లోడు సినిమా తీసి నాగార్జున కి కూడా ఒక అదిరిపోయే హిట్ ఇచ్చాడు….