SUV Cars : దేశంలో అత్యంత తక్కువ ధరకు లభించే SUV కార్లు ఇవే..

SUV సెగ్మెంట్ కార్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఎస్ యూవీ అనగానే ధర ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. కానీ కొన్ని కంపెనీలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా తక్కువ ధరలో కార్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటిలో కొన్నింటి గురించి..

Written By: Srinivas, Updated On : October 1, 2024 11:21 am

Low Budget SUV Cars 

Follow us on

SUV Cars :  కారు కొనాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఏ కారు కొనాలి? ఆ కారు ఎలా ఉండాలి? అనే సందేహంలో ఉంటారు చాలా మంది. ప్రస్తుత కాలంలో మార్కెట్లోకి డిఫరెంట్ కార్లు వస్తున్నాయి. అయితే వినియోగదారులు తమకు నచ్చిన విధంగా కారు ఉండాలని అనుకుంటారు. కొందరు లో బడ్జెట్ లో కారు కొనాలని చూస్తే.. మరికొందరు ఫీచర్స్ తో పాటు కారు డిజైన్ బాగుండాలని కోరుకుంటున్నారు. కానీ ఓవరాల్ గా SUV, MPV కార్లను ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సెగ్మెంట్ కార్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఎస్ యూవీ అనగానే ధర ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. కానీ కొన్ని కంపెనీలు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా తక్కువ ధరలో కార్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటిలో కొన్నింటి గురించి..

సాధారణంగా ఎస్ యూవీ సెగ్మెంట్ కారు రూ.10 లక్షలకు తక్కువగా ఉండదు. కానీ రెనాల్ట్ కంపెనీకి చెంది ట్రైబర్ కారు రూ.6.33 లక్షల కు అందుబాటులో ఉంది. ఎంపీవీ సెగ్మెంట్ కు చెందిన ఈ కారు 7 సీటర్ కారు. దేశంలోనే ఈ వేరియంట్ లో అతి తక్కువ ధరతో వస్తుంది. ఇదే కంపెనీకి చెందిన కిగర్ సైతం రూ.6.47 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. కిగర్ ప్రస్తుతం 21 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

దేశంలో అత్యధిక సేల్స్ నమోదు చేసుకుంటున్న కార్లలో మారుతి ఒకటి. ఈ కంపెనీకి చెందిన కార్లు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలుస్తాయి. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు అన్ని వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎస్ యూవీలో బ్రెజ్జా కారు మంచి ఆదరణ పొందుతోంది. ఈ కారు రూ.8.29 లక్షల ప్రారంభ ధర నుంచి అందుబాటులో ఉంటుంది. మారుతి తరువాత అత్యధికంగా అమ్ముడు పోతున్న కార్లలో టాటా ఒకటి. ఈ కంపెనీకి చెందిన నెక్సాన్ ఫేస్ లిప్ట్ బెస్ట్ ఎస్ యూవీగా నిలిచింది. ఈ కారును రూ.8.10 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.15.50 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

దక్షిణ కొరియా కంపెనీకి చెందిన హ్యుందాయ్ కార్లకు భారత్ లో ఆదరణ ఎక్కువ. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెన్యూ బెస్ట్ ఎస్ యూవీగా నిలిచింది. ఈ మోడల్ ను రూ.7.77 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. అంతేకాకుండా ఈ మోడల్ లీటర్ ఇంధనానికి 17 నుంచి 18 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మహీంద్రా కంపెనీ నుంచి బొలెరో నియో 7 సీటర్ కారుగా నిలిచింది. ఎస్ యూవీ వేరియంట్ లో ఉన్న ఈ కారు రూ.9.63 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇదే కంపెనీకి చెందిన మహీంద్రా XUV300 ను రూ.7.99 లక్షల ధరతో విక్రయిస్తున్నారు. ఇక నిస్సాన్ కంపెనీకి చెందిన మాగ్నౌట్ కారు చౌవకైన ఎస్ యూవీగా నిలిచింది. దీనిని రూ.6 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. దేశంలో ఎస్ యూవీ వేరియంట్ లో తక్కువ ధరకు లభించే కార్లలో ఇది నిలుస్తుంది.