https://oktelugu.com/

Maruti Cars 2024: మారుతి సుజుకీ 2024లో మార్కెట్లోకి తీసుకొచ్చే కార్లు ఇవే.. ఓ కారు స్పెషల్ ఏంటంటే?

మారుతి కార్లలో స్విప్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ మోడల్ హాట్ ఫేవరేట్ గా నిలిచింది. గత రెండేళ్లలో దీని అమ్మకాలు టాప్ 10 లో ఉండడం విశేషం. ఇప్పుడీ కారును అప్డేట్ చేయనున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : January 16, 2024 / 01:32 PM IST

    Maruti Cars 2024

    Follow us on

    Maruti Cars 2024: దేశంలోని కార్ల ఉత్పత్తిలో మారుతి సుజుకీ అగ్రగామిగా నిలుస్తోంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన వివిధ మోడళ్లు ఇప్పటికే వినియోగదారులను విపరీతంగా ఆకర్షించాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ ఫీచర్స్ తో అలరిస్తూ ఆకర్షణీయమైన కార్లను తీసుకొస్తున్న మారుతి సుజుకీ.. కొత్త సంవత్సరం 2024లో కొన్ని మోడళ్లను మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. వీటిలో ఇప్పటి కే ఉన్న వాటిని అప్డేట్ చేసి కొత్త తరహాలో విడుదల చేయనుంది. అలాగే వినియోగదారులకు సర్ ఫ్రైజ్ ఇచ్చేలా మరో కారు స్పెషల్ గా నిలవనుంది. మరి ఆ కార్ల గురించితెలుసుకుందామా..

    మారుతి కార్లలో స్విప్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ మోడల్ హాట్ ఫేవరేట్ గా నిలిచింది. గత రెండేళ్లలో దీని అమ్మకాలు టాప్ 10 లో ఉండడం విశేషం. ఇప్పుడీ కారును అప్డేట్ చేయనున్నారు. ఈ కారులోని ఇంటీరియర్ లో కీలక మార్పులు చేయనున్నారు. దీనికి కొత్త గా అల్లాయ్ వీల్స్ ను అమర్చనున్నారు. వచ్చే మార్చిలో విడుదల కానున్న ఈ మోడల్ రూ.6 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు.

    ఈ కంపెనీ హ్యాచ్ బ్యాక్ కార్ల నుంచి ఎస్ యూవీల వరకు ఉత్పత్తి చేస్తుంది. వీటిలో 7 సీటర్ కూడా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన 7 సీటర్ గ్రాండ్ విటారాకు కొత్త మార్పులు చేయనున్నారు. దీని పొడవు పెంచనున్నారు. ఇంజన్ లోనూ మార్పులు చేయనున్నారు. మొత్తంగా డిజైన్ లో కీలక మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మారుతి ఉత్పత్తి చేసిన 7 సీటర్ లో మరొకటి ఎర్టిగా. అయితే ఎర్టీగా మోడల్ లోనే కొత్త ఎంపీవీని అభివృద్ధి చేయనున్నారు. దీనిని ఎర్టీగా కంటే తక్కువ ధరకే అందించేందుకు ప్లాన్ వేస్తున్నారు. మారుతి డిజైర్ మోడల్ కు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించింది. హ్యాచ్ బ్యాక్ కంటే ఎక్కువ… ఎస్ యూవీ కంటే తక్కువ వేరియంట్ ను కలిగిన డిజైర్ లో అప్డేట్ ఫీచర్స్ ను అమర్చనున్నారు. దీనికి ఎలక్ట్రిక్ సన్ రూప్ అమర్చనున్నారు.

    మారుతినుంచి మరో స్పెషల్ కారు రానుంది. ఈ కంపెనీ నుంచి తొలి ఎలక్ట్రిక్ ఎస్ యూవీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకుప్లాన్ చేస్తున్నారు. ఇది 48kWh, 60kWh అనే రెండు బ్యాటరీల సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. అయితే దీనిని త్వరలో ప్రారంభించి వచ్చే అక్టోబర్ నాటికి మార్కెట్లోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటాకు పోటీగా ఉత్పత్తి చేయనున్నట్లు తెలుస్తోంది.