Seven-seater cars : ప్రస్తుత కాలంలో ఫ్యామిలీ అంతా కలిసి విహార యాత్రలకు వెళ్లాలని అనుకుంటున్నారు. అయితే బస్సుల్లో రైళ్లలో కుటుంబ సభ్యులు కలిసి ప్రయాణించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సొంతంగా వెహికల్ ఉండాలనే ఉద్దేశంతో చాలామంది ఫోర్ వెహికిల్ కొనుగోలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కువగా హచ్ బ్యాక్ కంటే 7 సీటర్ కార్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కంపెనీలు సైతం సెవెన్ సీటర్ కార్లను ఎక్కువగా మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లో బెస్ట్ సెవెన్ సీటర్ కాలనీగా కొన్ని గుర్తింపు పొందాయి. అవేంటంటే..?
సెవెన్ సీటర్ కార్లు కొనాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ కార్లు కొన్ని ఉన్నాయి. వీటిలో మారుతి, టయోటా, మహీంద్రా కంపెనీకి చెందిన కార్లు ఎక్కువగా గుర్తింపు పొందాయి. మారుతి కంపెనీకి చెందిన ఈకో సెవెన్ సీటర్ కారు పెద్ద ఫ్యామిలీకి అనుగుణంగా ఉంది. ఈ మోడల్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు సిఎన్జి వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. మాన్యువల్ AC ఆప్షన్ తో పాటు ప్రయాణికుల సేఫ్టీ కోసం ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ను అమర్చారు. మారుతి సుజుకి ఈకో లీటర్ పెట్రోల్ కు 19.71 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. సిఎన్జి వేరియంట్ లో 26.78 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. దీనిని మార్కెట్లో 5.32 లక్షల నుంచి 6.58 లక్షల రూపాయల వరకు విక్రయిస్తున్నారు.
సెవెన్ సీటర్ వేరియంట్ లో మరో కారు ఆకర్షిస్తుంది. ఇది టయోటా కంపెనీకి చెందిన Rumion MPV. ఆరుగురి కంటే ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్లాలనుకునేవారు టయోటా rumion ఎంపీ వి కారును బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆటోమేటిక్ ఏసీ ఫీచర్లు ఉన్నాయి. 6 స్పీకర్స్ సౌండ్ సిస్టం అలరిస్తుంది. సేఫ్టీ కోసం మొత్తం 4 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం కూడా ఆకర్షిస్తుంది. ఈ మోడల్ 1.5 లీటర్ పెట్రోల్ తోపాటు సిఎన్జి ఆప్షన్ లో కూడా ఉంది. పెట్రోల్ ఇంజన్ లీటర్ ఇంధనానికి 20.11 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే సిఎన్జి వేరియన్ 26.11 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. దీనిని 10.44 లక్షల నుంచి 13.73 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
మహేంద్ర కార్లు అంటే చాలామంది లైక్ చేస్తారు. ఈ కంపెనీకి చెందిన బొలెరో నియో సెవెన్ సీటర్ వేరియంట్ లో అలరిస్తోంది. ఈ మోడల్ లో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ను అమర్చారు. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లో పనిచేస్తుంది. ఈ ఇంజన్ లీటర్ ఇంధనానికి 17.29 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని 9.95 లక్షల నుంచి 12.15 లక్షల వరకు విక్రయిస్తున్నారు.