https://oktelugu.com/

Best Cars: ఫ్యామిలీతో టూర్ కెళ్లేందుకు బెస్ట్ కార్లు ఇవే.. వెంటనే బుక్ చేసుకోండి..

ప్రతిరోజూ.. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనితో ఒత్తిడితో ఉంటున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు రిలాక్స్ కావడానికి కొన్ని మార్గాలను ఎంచుకుంటున్నారు. బయటకెళ్లి పనులు చేసేవారితో పాటు ఇంట్లో ఉండే గృహిణులు, విద్యార్థులు మానసికంగా స్ట్రెస్ కు గురవుతున్నారు. దీంతో ఫ్యామిలీ అంతా కలిసి టూర్ ట్రిప్ కు ప్లాన్ వేయాలనుకుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 23, 2023 / 11:06 AM IST

    Best Cars

    Follow us on

    Best Cars: ఫ్యామిలీతో కలిసి టూర్ ట్రిప్ కు ప్లాన్ వేస్తారు. కానీ కొన్ని ప్రదేశాలకు వెళ్లాలంటే సొంతంగా వెహికల్ ఉంటేనే బెటరని చాలా మంది భావిస్తున్నారు. దీంతో బడ్జెట్ కు అనుగుణంగా కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఫ్యామిలీతో పాటు కార్యాలయాలకు వెళ్లాలనుకునేవారు మైలేజ్ కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీంతో కొన్ని కంపెనీలు మైలేజ్ పై ఫోకస్ చేసి ఆ విధంగా ఉత్పత్తిని చేస్తున్నాయి. మారుతి, హ్యుందాయ్, రెనాల్డ్ వంటి కంపెనీలు మైలేజ్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

    ప్రతిరోజూ.. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనితో ఒత్తిడితో ఉంటున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు రిలాక్స్ కావడానికి కొన్ని మార్గాలను ఎంచుకుంటున్నారు. బయటకెళ్లి పనులు చేసేవారితో పాటు ఇంట్లో ఉండే గృహిణులు, విద్యార్థులు మానసికంగా స్ట్రెస్ కు గురవుతున్నారు. దీంతో ఫ్యామిలీ అంతా కలిసి టూర్ ట్రిప్ కు ప్లాన్ వేయాలనుకుంటారు. అయితే కాస్త దూరం ఉన్న వెకేషన్ కు వెళ్లాలంటే ప్రత్యేకంగా వాహననం తీసుకెళ్లాలి. అయితే ప్రతీసారి ఇలా అద్దెకు తీసుకోవడం వ్యయభారమే అవుతుంది. దీంతో చాలా మంది సొంత కార్లు ఉండాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఫ్యామిలీ టూర్ ను దృష్టిలో పెట్టుకొని కొన్ని మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    మారుతి కార్ల కంపెనీ దేశంలో అగ్రగామిగా నిలుస్తోంది. ఈ కంపెనీ నుంచి వివిధ మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఆల్టో కే 10 ఒకటి. పెట్రోల్, సీఎన్ జీ రెండు వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ కారు రూ.4 లక్షల ప్రారంభ ధర ఉంది. ఇది పెట్రోల్ వేరియంట్ 24.39 కిలోమీటర్లు, సీఎన్ జీ 33.85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఎస్పెస్రో(espresso) ఒకటి. పెట్రోల్ వేరియంట్ తో పాటు సీఎన్ జీలో అందుబాటులో ఉంది. ఈ కారు పెట్రోల్ ద్వారా 24 కిలోమీటర్లు, సీఎన్ జీ 32 కిలోమీటర్లమైలేజ్ ఇస్తుంది.

    రెనాల్ట్ కార్లు అందరికీ సుపరిచితమే. దీని నుంచి క్విడ్ బెస్ట్ కారుగా నిలిచింది. ఈ కారు ఫ్యామిలీకి అనుగుణంగా ఉంటుందని అంటున్నారు. ఈ మోడల్ లీటర్ కు 20 నంచి 22 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీనిని 4.70 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. హ్యాందాయ్ కంపెనీ నుంచి రిలీజ్ అయినా ఐ 10 కూడా మైలేజ్ ఇచ్చే కార్ల వరుసలో చేరింది. ఇది పెట్రోల్ వేరియంట్ లో 19.2 కిలోమీటర్లు, సీఎన్ జీ వేరియంట్ లో 28 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.