Google : గూగుల్ లో ఈ తప్పును చూపించి రూ.1.12 కోట్లు గెలుచుకున్నాడు..

ఇక్కడ మాత్రం తన తప్పును ఎత్తి చూపినందుకు కోటి రూపాయలకు పైగా బహుమతి ఇచ్చారు.

Written By: Srinivas, Updated On : January 27, 2024 3:56 pm

sriram won crore rupees from google

Follow us on

Google : ఒక పని చేసినప్పుడు అందులో మిస్టేక్ చెబితే కొందరికి కోపం వస్తుంది.. మరికొందరు తమ తప్పును తెలుసుకొని సరిదిద్దుకుంటారు.. కానీ ఇక్కడ మాత్రం తన తప్పును ఎత్తి చూపినందుకు కోటి రూపాయలకు పైగా బహుమతి ఇచ్చారు. అంతేకాకుండా ఇంకెవరైనా ఇలాంటి తప్పులు చెప్పమని ఓ కార్యక్రమాన్ని చేపట్టింది ఓ కంపెనీ. అదేదో అల్లాటప్పా కంపెనీ కాదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సెర్చ్ ఇంజిన్ Google. ప్రపంచంలో ఇంటర్నెట్ యూజ్ చేసేవాళ్లు గూగుల్ ను టచ్ చేయంది ఉండరు. మరి అలాంటి కంపెనీలో కొన్ని తప్పులు ఉన్నాయని ఓ యువకుడు చెప్పాడు. వెంటనే అతనికి కోటి రూపాయలు ఇచ్చి సత్కరించింది. ఇంతకీ అతనికి అంత డబ్బు ఎందుకు ఇచ్చినట్లు? అసలేంటీ కథ?

ప్రముఖ Google ఇంటర్నెట్ తెలిసిన ప్రతి ఒక్కరూ వాడుతారు. ఎంత పకడ్బందీగా ఉన్నా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కంపెనీల్లో తప్పులు జరగకుండా ఉండవు. ఈ నేపథ్యంలో కంపెనీ తన లోపాలను గుర్తించేందుకు ‘వర్నరబిలిటీ రివార్డ్’ నే ప్రోగ్రామ్ ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గూగుల్ ఉన్న లోపాలను గుర్తించి చెప్పగలగాలి. అది నిజమైనదని తేలితే ఆ తప్పును గుర్తించిన వారికి రివార్డ్ ఇస్తారు. ఈ రివార్డ్ మాములుగా ఉండదు. కోట్లలో ఉంటుంది.

‘వర్నరబిలిటీ రివార్డ్’ అనే కార్యక్రమంలో భారత్ లోని కేరళకు చెందిన శ్రీరామ్ పాల్గొన్నాడు. అతడు అంతకుముందే ‘స్క్వాడ్రన్ ల్యాబ్స్ అనే స్టార్టప్ కంపెనీని నిర్వహిస్తున్నాడు. ఈయన కంపెనీలపై సైబర్ దాడులు ఎలా జరుగుతాయి? వాటి నుంచి ఎలా తట్టుకోవాలి? అనే విషయాలను గుర్తించగలడు. ఇప్పటి వరకు ఎన్నో కంపెనీలను సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా కాపాడగలిగాడు. ఈ తరుణంలో తాజాగా నిర్వహించిన వర్నబిలిటీ రివార్డ్ ప్రోగ్రామ్ లో శ్రీరామ్ పాల్గొన్నాడు.

శ్రీరామ్ గూగుల్ లోని సెక్యూరిటీ లోపాలను గుర్తించి.. వాటిని కంపెనీకి తెలియజేశాడు. అతనితో పాటు తన స్నేహితుడు చెన్నైకి చెందిన శివనేష్ అశోక్ లు కలిసి 4 నివేదికలు పంపారు. అయితే శ్రీరామ్, రెండు, మూడు, నాలుగోస్థానంలో నిలిచాడు. ఇందుకు గానే అతనికి 1,35,979 డాలర్లను బహుతిగా ఇచ్చారు. అంటే భారత కరెన్సీ ప్రకారం 1,12,86,257 కోట్లు గెలుచుకున్నాడు. శ్రీరామ్ గతంలో కూడా గూగుల్ లో ఉన్న భద్రత లోపాలను గుర్తించి బహుమతిని పొందాడు.