7-seater car : కారు కొనాలని అనుకునే వారి అభిప్రాయాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఒకప్పుడు తక్కువ ధరలో చిన్నపాటి కారు ఉంటే సరిపోతది అనుకున్నారు. కానీ ఇప్పుడు కాస్త ధర ఎక్కువ అయినా విశాలమైన కారు ఉండాలని అనుకుంటున్నారు. వినియోగదారులకు అనుగుణంగా కంపెనీలో సైతం విశాలమైన కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా 7 సీటర్ కార్లకు ప్రాధాన్యత పెరిగింది. ఇప్పటికే చాలా కంపెనీలు 7 సీటర్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అయితే ఇటీవల రెనాల్ట్ కంపెనీకి చెందిన 7 సీటర్ గురించి తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఇంతకీ ఈ కారులో ఏముందంటే?
ఏ కారు కొనుగోలు చేయాలన్నా వినియోగదారుడు దాని ధరతో పాటు మైలేజ్ పరిశీలిస్తారు. అయితే సాధారణంగా సెవెన్ సీటర్ కార్లకు ధర ఎక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా మైలేజ్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ రెనాల్ట్ కంపెనీకి చెందిన ట్రైబర్ సెవెన్ సీటర్ అందుకు భిన్నంగా ఉందని అంటున్నారు. ఎందుకంటే ఈ కారు తక్కువ ధరతో పాటు మంచి మైలేజ్ కూడా ఇస్తుందని వినియోగదారులు అంటున్నారు.
Also Read : రామ్ చరణ్ ని చూసి వెనక్కి తగ్గేది లేదంటున్న నాని..టాలీవుడ్ లో మరో సంచలనం!
రెనాల్ట్ triber కారు ఇంజన్ విషయానికి వస్తే.. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 72 బిహెచ్పి పవర్ తో పాటు 96 ఎన్ఎం టార్కును రిలీజ్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ ఆన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ ఆప్షన్తో పనిచేస్తుంది. ఏడుగురు వ్యక్తులు సురక్షితంగా ప్రయాణం చేసే ఈ కారులో 20.32 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం అమర్చారు. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆపిల్ కార్ ప్లే తో పాటు ఆండ్రాయిడ్ ఆటో, బ్లూటూత్ సిస్టం, యు స్పీక్ కనెక్టివిటీ వంటివి ఆకర్షిస్తున్నాయి.
సేఫ్టీ విషయంలోనూ ఈ కారు బెటర్ అని కొనియాడుతున్నారు. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, EBD తోపాటు ABS టెక్నాలజీని అమర్చారు. వెనుక వైపు పార్కింగ్ సెన్సార్లు.. స్పీడ్ అలర్ట్ సిస్టం అమర్చారు. దీంతో ఈ కారులో ప్రయాణం సేఫ్టీ అని అంటున్నారు. ఇక ఈ కారు మైలేజ్ విషయంలో చాలామంది ప్రశంసలు గుర్తిస్తున్నారు. ఎందుకంటే లీటర్ పెట్రోల్ ఇంధనానికి 22 నుంచి 26 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అయితే ఇందులో సిఎన్జి ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీనిపై 33 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.
Also Read: ప్రభాస్ లుక్కే ఇప్పుడు ట్రెండింగ్.. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ట్రోల్స్!
ఇన్ని ఫీచర్లో ఉన్న ఈ కారు ధర కేవలం రూ 4. 23 లక్షల ధర నుంచి రూ. 5.30 లక్షల వరకు అందుబాటులో ఉంది. తక్కువ ధరలో సెవెన్ సీటర్ కారును కొనాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. అంతేకాకుండా ఈ కారు డిజైన్ కూడా ఆకర్షించే విధంగా ఉంది. ఉమ్మడి కుటుంబం ఉన్నవారు, వ్యాపార అవసరాలకు కూడా ఉపయోగించేవారు ట్రైబర్ కారు ఎంతో అనుకూలంగా ఉంటుంది.